ఎన్టీఆర్ కి దేవిశ్రీ ఆ మాట చెప్పేశాడా?

Update: 2015-12-16 09:30 GMT
దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి మరణంతో.. ఇప్పుడు నాన్నకు ప్రేమతో రిలీజ్ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంకా బీజీఎం వర్క్ పెండింగ్ ఉండడంతో.. దేవి ఈ పరిస్థితిలో ఆర్ ఆర్ ఇచ్చే పరిస్థితిలో లేడనే వార్తలొస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఖచ్చితంగా ఉంటామని చెప్పి.. ఇప్పుడు తలెత్తిన పరిస్థితితో వాయిదా పడక తప్పదనే న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. అయితే.. యూనిట్ వర్గాల మాటలు మాత్రం వేరేగా ఉన్నాయి.

ప్రస్తుత సిట్యుయేషన్ తో ఈ నెల 23న జరగాల్సిన ఆడియో ఫంక్షన్ లేట్ అవుతుంది కానీ.. మూవీ రిలీజ్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని చెబ్తున్నారు. దీనికి కారణం దేవిశ్రీయే అని తెలుస్తోంది. ఇప్పటికే మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేసే విషయాన్ని డీఎస్పీనే ఫోన్ చేసి మాట్లాడాటడ. దీని ప్రకారం తాను వర్క్ ఫినిష్ చేస్తానని అన్నాడని తెలుస్తోంది. మూవీ రిలీజ్ డేట్ కి నాలుగు రోజుల ముందు అంటే జనవరి 8కి సెన్సార్ కి ప్రింట్ పంపేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పాడట దేవిశ్రీ. ఈ మేరకు మేకర్స్ కి చెప్పాడని, అందుకే రిలీజ్ లేట్ ఉండదంటూ.. నిర్మాతలు చెబ్తున్నారని తెలుస్తోంది. తన కారణంగా 50 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ డిలే అవడం ఇష్టం లేకే దేవి ఇలా డెసిషన్ తీసుకున్నాడంటున్నారు.

ఒక భారీ చిత్రం లేట్ అయితే..  నిర్మాతకు ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. తన ఒక్కడి కారణంగా లేట్ అవడం ఇష్టంలేక దేవిశ్రీ ఈ విషయంలో స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడట. త్వరలోనే తండ్రి పితృకర్మల కార్యక్రమాలు పూర్తి చేసేసుకుని.. బీజీఎం సంగతి చూడబోతున్నాడు. ఈ పరిస్థితిలోనూ వర్క్ విషయంలో దేవి చూపిస్తున్న కమిట్ మెంట్ పై సినీ ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
Tags:    

Similar News