నాన్న కోసం స్పెషల్ సాంగ్ వస్తోంది

Update: 2016-01-12 12:30 GMT
నాన్నకు ప్రేమతో చిత్రం షూటింగ్ చివర్లో ఉండగా.. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి కాలం చేశారు. ఈ ప్రభావంతో ఎన్టీఆర్ మూవీ ఆలస్యం అవుతుందని అందరూ భావించారు. కానీ తండ్రి మరణించిన మూడో రోజు నుంచే నాన్నకు ప్రేమతో కోసం ఇచ్చిన కమిట్ మెంట్ ను పూర్తి చేసేందుకు పని స్టార్ట్ చేసేశాడు దేవిశ్రీ. ఈ విషయాన్ని ఆడియో వేడుకలో పంచుకుంటూ.. కళ్లనీళ్ల పర్యంతం అయ్యాడు కూడా.

ఇప్పుడు తన తండ్రికి నివాళి ఇచ్చేందుకు.. డీఎస్పీ ఈ మూవీనే ఉపయోగించుకుంటున్నాడు. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న నాన్నకు ప్రేమతో ఎండ్ టైటిల్ పడేటప్పుడు.. ఓ స్పెషల్ సాంగ్ రానుంది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా రాసి, కంపోజ్  చేశాడు. తన తండ్రికి ఈ పాటతో కన్నీటి నివాళి ఇస్తున్నానని చెప్పాడు దేవిశ్రీ. ఈ పాట పూర్తిగా ఎమోషనల్ గా ఉండనుందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని తట్టిలేపేలా ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ సాంగ్ ను స్పెషల్ గా ప్రత్యేకమైన అకేషన్ ఏర్పాటు చేసి రిలీజ్ చేయనున్నారట.

ఇదిలా ఉంటే.. నాన్నకు ప్రేమతో మొత్తం ఆల్బంలో తండ్రిపై పాట లేదు. ఎమోషన్ అన్నారు, సెంటిమెంట్ అన్నారు. కానీ తండ్రీ కొడుకుల మధ్య ఒక ఎమోషనల్ పాట కూడా లేదేంటి అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇప్పుడీ లోటును.. దేవిశ్రీ రాసిన స్పెషల్ సాంగ్ తీర్చనుంది. 
Tags:    

Similar News