మళ్లీ వార్తల్లో నిలిచిన 'మ్యాజిక్‌'

ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'మ్యాజిక్‌' కి సంబంధించి ఇప్పటి వరకు ఆరు పాటలు పూర్తి అయ్యాయి. మరో పాటను పూర్తి చేయాల్సి ఉంది.

Update: 2024-12-28 15:30 GMT

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో వరుసగా సినిమాలను నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో మొదలైన యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్ మూవీ 'మ్యాజిక్‌'. ఈ సినిమా మ్యూజిక్‌ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. అంతా కొత్త వారితో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది, అంతే తప్ప సినిమా క్యాన్సిల్‌ కాలేదని వంశీ క్లారిటీ ఇచ్చారు.

ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'మ్యాజిక్‌' కి సంబంధించి ఇప్పటి వరకు ఆరు పాటలు పూర్తి అయ్యాయి. మరో పాటను పూర్తి చేయాల్సి ఉంది. ఒక్కో పాటను విడుదల చేయాలని మొదట భావించినా, ఈ సినిమా పాటల ప్రాముఖ్యత నేపథ్యంలో అన్ని పాటలను ఒకే సారి జ్యూక్‌ బాక్స్ రూపంలో విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. గతంలో ఒక సినిమా పాటలన్నీ ఒకే సారి విడుదల చేసే వారు. మధ్యలో ఒక్కో పాట చొప్పున విడుదల చేసే ట్రెండ్‌ వచ్చింది. కానీ మ్యాజిక్‌ సినిమాతో మళ్లీ పాత పద్దతిని తీసుకు రాబోతున్నట్లుగా వంశీ ప్రకటించడంతో ఈ సినిమా వార్తల్లో నిలిచింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాతో బిజీగా ఉన్న గౌతమ్‌ తిన్ననూరి త్వరలోనే ఈ సినిమాను ముగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మ్యాజిక్ సినిమాలోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాలను పూర్తి చేయడం ద్వారా సినిమాను విడుదలకు రెడీ చేసే అవకాశాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కావాల్సి ఉంది. కనుక దానికి తగ్గట్లుగా మ్యాజిక్‌ విడుదల తేదీని ప్లాన్‌ చేస్తామని నిర్మాత నాగవంశీ అన్నారు.

ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి త్వరలోనే క్లారిటీగా అప్డేట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సారా అర్జున్‌ ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ లో కనిపించబోతుండగా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్నాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేసే విధంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ వారు ఏర్పాట్లు చేస్తున్నారు. నానితో జెర్సీ వంటి సూపర్ హిట్‌ సినిమాను రూపొందించిన గౌతమ్‌ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ ఉండటంతో అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. వచ్చే ఏడాదిలోనే రెండు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News