సాధారణంగా ఈ రోజుల్లో ఏదైనా ఒక సినిమాకు కాస్త డివైడ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ పై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతుంది. కానీ రవితేజ అదృష్టం ఏమిటో కానీ మాస్ రొటీన్ కమర్షియల్ సినిమాలు అనే టాక్ మొదట్లోనే వచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంటున్నాడు.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమాకా సినిమాకు మొదట్లోనే నెగిటివ్ రివ్యూలు ఎక్కువగా వచ్చాయి. పెద్దగా కంటెంట్ ఏమీ కొత్తగా లేదు అని సినిమా చాలా రొటీన్ గా ఉంది అని సోషల్ మీడియాలో కూడా పెద్ద టాక్ వినిపించింది.
కానీ ఈ సినిమా ఆ విమర్శలకు రివ్యూలకు కౌంటర్ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. కేవలం వీకెండ్స్ మాత్రమే కాకుండా సోమవారం నుంచి కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
ఇక ఐదవ రోజు బుధవారం కూడా నెంబర్స్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు చాలా సెంటర్లలో అయితే కొన్ని థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కనిపించాయి. ఎక్కువగా మాస్ ఏరియాలలో ఈ సినిమాకు అద్భుతమైన క్రేజ్ వస్తోంది. రవితేజ మాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి ధమాకా సినిమా నిరూపించింది. ఆడియన్స్ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు కామెడీ సన్నివేశాలు అలాగే శ్రీలీల పెర్ఫార్మెన్స్ బాగా కనెక్ట్ అయినట్లుగా అనిపిస్తుంది.
ఇక ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 21 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక అందులో తెలుగు రాష్ట్రాల్లోనే 18 కోట్లకు పైగా షేర్ రావడం విశేషం. మొత్తంగా థియేట్రికల్ ద్వారా ఈ సినిమా ఈవారం మరిన్ని కలెక్షన్స్ తో 28 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక న్యూ ఇయర్ వీకెండ్స్ లో కూడా ఈ సినిమాకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. దాదాపు సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేవు కాబట్టి అప్పటివరకు సినిమా లెక్కలు 30 కోట్ల వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.