కరోనా-లాక్ డౌన్ తో సినిమా ఇండస్ట్రీ మూతపడింది. థియేటర్లు బంద్ అయిపోయాయి. అన్నీ తెరిచినా థియేటర్లకు అనుమతులు వచ్చినా జనాలు మాత్రం కరోనా భయానికి థియేటర్లకు రావడం లేదు. సినీ ఇండస్ట్రీ కూడా ఈ సమయంలో వారిని రప్పించే సాహసం చేయడం లేదు. అయితే ప్రేక్షకులను ఆకర్షించే స్టామినా ఉన్న అగ్ర హీరోలు తమ వంతు ప్రయత్నం చేస్తే అది సాధ్యమే. కానీ ఇప్పుడా ఆ సాహసం ఎవరు చేస్తారన్నది ఇప్పుడు ముఖ్యం.
సినీ పరిశ్రమను సాధారణ స్థితికి చేర్చడానికి అగ్రహీరోలు ప్రయత్నించడం లేదు. వారు సైతం భయపడుతున్నారు. టాలీవుడ్ లో అర డజనుకు పైగా సినిమాలు సంక్రాంతి కోసం విడుదల చేయాలని ప్లాన్ చేశారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పునరాగమన చిత్రం ‘వకీల్ సాబ్’ సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఇప్పుడు అకస్మాత్తుగా వాయిదా వేశారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనే నమ్మకంతో లేడని.. సమ్మర్ 2021 కు వాయిదా వేయాలని చూస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఏప్రిల్ 9, 2021 విడుదల తేదీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇది జరిగితే, అతిపెద్ద పండుగ సీజన్ సంక్రాంతికి మళ్లీ సినీ ఇండస్ట్రీ కోలుకోదని అర్థమవుతోంది.
సాధారణ స్థితికి తీసుకురావడానికి టాలీవుడ్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. సంక్రాంతికి స్టార్ హీరోలు తమ సినిమాలు విడుదల చేయాలనే నిర్ణయం సరైనది. దాంతోనైనా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చు. అయితే అలాంటి సాహసానికి చిత్రనిర్మాతలు రావడం లేదు. హీరోలు ధైర్యం చేయడం లేదు. అలాగే, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమా వస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు వచ్చే చాన్స్ ఉంది. ప్రీ-కోవిడ్ రోజుల్లో మాదిరిగా థియేటర్లలోకి రావడానికి ప్రేక్షకులను ప్రేరేపించే అవకాశం ఉంది. కానీ ఆయన కూడా వెనకడుగు వేయడంతో ఇప్పుడు కథ మొదటికి వచ్చింది.
సంక్రాంతి నుంచి సమ్మర్ కు షిఫ్ట్ అవుతున్నట్టైతే ఈ సంక్షోభంలో పవన్ కళ్యాణ్ - దిల్ రాజు చిత్ర పరిశ్రమను నిరాశపరుస్తున్నట్టే లెక్క. కానీ ఏ రోజునైనా సెంటిమెంట్ కంటే వసూళ్లు, లాభాలే హీరోలు, నిర్మాతలకు కీలకం. నిండా మునగడానికి ఎవరూ సిద్దంగా ఉండు. అందుకే వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనాకు ఎదురు వెళ్లడానికి ఏ హీరో, నిర్మాత సాహసించడం లేదు.
నిజానికి వకీల్ సాబ్ ఏప్రిల్ 2020 లో విడుదల చేయాల్సి ఉంది, కానీ ఈ ఆలస్యం ఇప్పుడు విడుదల తేది కంటే ఒక సంవత్సరం ఆలస్యంగా విడుదల అవుతోంది. మొత్తం షూటింగ్ భాగం ఈ నెలలోనే పూర్తవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి సినిమా రెడీ అవుతుంది.