జక్కన్న స్ట్రేటజీ ఫాలో అవుతున్న మణి సార్!

Update: 2019-05-10 08:16 GMT
సౌత్ లో ఉన్న లెజెండరి ఫిలిం మేకర్స్ లో మణిరత్నం ఒకరు.  జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తం అవుతుంది.  కొంతకాలం క్రితం 'నవాబ్' సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసిన మణి సార్ ఈసారి ఒక భారీ హిస్టారికల్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

'పొన్నియన్ సెల్వన్' అనే టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాలో భారీ తారగణం ఉంటుందని సమాచారం.  విక్రమ్.. విజయ్ సేతుపతి.. జయం రవి.. అనుష్క.. కీర్తి సురేష్ లాంటి సౌత్ స్టార్స్ తో పాటుగా బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్.. ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటిస్తారు. మణి గారి ఆస్థాన సంగీత విద్వాంసుడు ఎఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడు.  ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని మణి రత్నం ప్లాన్ చేస్తున్నాడట. మరి ఎస్ ఎస్ రాజమౌళి 'బాహుబలి' ని రెండు భాగాలుగా రిలీజ్ చేసి భారీ సక్సెస్ సాధించినట్టుగా మణి సారు కూడా 2-పార్ట్ స్ట్రేటజీ ఫాలో అవున్నాడేమో.  అయితే ఈ రెండు భాగాల రిలీజ్ లో పెద్దగా గ్యాప్ ఉండదట. ఒకే ఏడాదిలో.. అంటే 2021 లో రిలీజ్ అవుతాయట.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మద్రాస్ టాకీస్.. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తాయి. ఈమధ్యకాలంలో మణి రత్నం భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించలేదు. విజయాల శాతం కూడా దాదాపుగా తగ్గిపోయింది.  మరి ఈ భారీ బడ్జెట్ హిస్టారికల్ ఫిలింతో విజయం సాధిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

    

Tags:    

Similar News