జక్కన్న దారిలోనే శంకర్‌ కూడా ఇక్కడిక్కడే..!

Update: 2021-08-06 06:38 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తన సినిమాలో మెజార్టీ సన్నివేశాలను హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. కొన్ని సన్ని సన్నివేశాలు అవసరం అయితే ఇతర రాష్ట్రాల్లో చిత్రీకరిస్తారు. చాలా అరుదుగా మాత్రమే విదేశాలకు వెళ్తారు. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ దాదాపుగా 80 శాతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే సెట్టింగ్ లు వేయించి చిత్రీకరించారు. కొన్న సన్నివేశాలను ఇతర రాష్ట్రాలకు వెళ్లారు.. ఇప్పుడు ఉక్రెయిన్‌ కు వెళ్లి అక్కడ రెండు పాటల చిత్రీకరణ చేస్తున్నారు. కాని కొందరు ఫిల్మ్‌ మేకర్స్ మాత్రం అవసరం ఉన్నా లేకున్నా కూడా విదేశాల్లో షూటింగ్ చేస్తూ ఉంటారు.

సినిమా రిచ్ గా కనిపించడం కోసం విదేశాలకు వెళ్లే ఫిల్మ్‌ మేకర్స్ కొందరు ఉంటారు. సినిమాను రిచ్‌ గా తీయాలంటే ఇక్కడ కూడా తీయవచ్చు అంటూ జక్కన్న తన బాహుబలి మరియు అంతకు ముందు సినిమాలతో చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను కూడా అద్బుతం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. విదేశీ షెడ్యూల్‌ వల్ల భారీగా ఖర్చు వస్తుంది. అంతే కాకుండా కొన్ని సార్లు నాచురల్‌ గా అనిపించవు. కనుక నాచురల్‌ గా ఉండాలని కోరుకునే వారు ఎక్కువగా ఇండియాలోనే షూట్‌ కు ప్రాముఖ్యత ఇస్తారు. రాజమౌళి దారిలోనే మరి కొందరు దర్శకులు కూడా ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా.. మేడ్ ఇన్‌ ఇండియా అన్నట్లుగా ఫిల్మ్‌ మేకింగ్‌ చేస్తున్నారు.

దిగ్గజ దర్శకుడు శంకర్ తన ప్రతి సినిమాను చాలా విభిన్నమైన లొకేషన్స్‌ లో ప్రత్యేక ప్రదేశాల్లో చిత్రీకరణ చేసేందుకు ఆసక్తి చూపించేవారు. కాని చరణ్‌ తో చేయబోతున్న సినిమాకు గాను హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మెజార్టీ సన్నివేశాలను తీయబోతున్నారట. హైదరాబాద్‌ తో పాటు తెలంగాణ లో కొన్ని చోట్ల షూటింగ్‌ ను చేయబోతున్నారు. ఇక తమిళనాడు లో కొన్ని చోట్ల కూడా షూటింగ్ కు సిద్దం అయ్యారట. సినిమాను తక్కువ సమయంలోనే పూర్తి చేయడం కోసం ఎక్కువగా హైదరాబాద్‌.. తెలంగాణలో మాత్రమే షూటింగ్‌ చేయాలని.. చివరి షెడ్యూల్‌ రెండు నుండి మూడు వారాలు మాత్రమే విదేశాల్లో ఉంటుందని దిల్ రాజు ఆఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. జక్కన్న దారిలోనే శంకర్‌ ఎక్కువగా ఇక్కడే షూటింగ్‌ చేయబోతున్న నేపథ్యంలో బడ్జెట్ కూడా చాలా వరకు కలసి వస్తుందంటున్నారు.

ఆ బడ్జెట్‌ ను ఇక్కడ సెట్టింగ్స్ ను మరింత భారీగా వేసే అవకాశాలు ఉంటాయి. కనుక విదేశీ షెడ్యూల్‌ ను శంకర్‌ తగ్గించారనే వార్తలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మంచి పరిణామం. ఇలా చేయడం వల్ల సినిమా ను వచ్చే ఏడాది వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా లో రామ్‌ చరణ్‌ కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్న విషయం ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంగీతాన్ని థమన్‌ అందించబోతున్నాడు. మొదటి సారి శంకర్‌ చరణ్‌ ల కాంబో సినిమాకు గాను థమన్‌ వర్క్‌ చేయబోతున్నాడు.


Tags:    

Similar News