రజినీ డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్య చేసుకుంటాడట

Update: 2018-03-02 17:28 GMT
సినిమా ఇండస్ట్రీలో నిర్మాత ఎంత వరకు నష్టపోతాడో గాని అతని తరువాత ఎక్కువగా నష్టపోయేది మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ అనే చెప్పాలి. ఒక సినిమాకు లాభాలు ఎంత వచ్చినా కూడా డిస్ట్రిబ్యూటర్స్ లబపడతారని అర్థం కాదు. ముఖ్యంగా పెద్ద హీరోలతో సినిమాలను నిర్మించే ప్రొడ్యూసర్స్ మీడియం బడ్జెట్ లో సినిమాను నిర్మించి పంపిణీదారులకు మాత్రం గట్టిగా అమ్ముతారు. అప్పుడు షేర్స్ వస్తే లాభం ఉంటుంది గాని పెద్దగా నష్టపోయేది ఉండదు.

అలాంటి సినిమాల రిజల్ట్ లో తేడా వస్తే ఎక్కువగా నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్స్. అదే తరహాలో రజినీకాంత్ గత చిత్రం కబాలి కూడా వచ్చి ఊహించని విధంగా పంపిణీదారులకు నష్టాలను మిగిల్చింది. ఆ సినిమాపై విడుదలకు ముందు అంచనాలు ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే నిర్మాత ఎస్.థాను సినిమా రిలీజ్ కు ముందే థ్రియేటికల్ రైట్స్ ద్వారా మంచి లాభాలను అందుకున్నాడు. సినిమా ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్స్ ని ముంచేసింది.

అయితే రీసెంట్ గా ఓ పంపిణీదారుడు ఆదుకోవాలని నిరసన వ్యక్తం చేస్తున్నాడు. లేకుంటే ఆత్మహత్య దిక్కని చెబుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సెల్వ కుమార్ అనే డిస్ట్రిబ్యూటర్ సినిమాను రూ5.5 కోట్లకు కొనుకున్నాడు. కానీ కబాలి లాభాలను తేకపోగా 2.8 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది. దీంతో నిర్మాత మీడియాతో చెప్పుకున్నాడు. నిర్మాతను అడిగితే ఆయన ఇస్తా అని చెప్పినా ఇంత వరకు ఎటువంటి సహకారం అందించలేదని రజినీకాంత్ కాంత్ కూడా తనకు సంబంధం లేదని చెప్పినట్లు సెల్వ కుమార్ తెలియజేశాడు.
Tags:    

Similar News