అమెరికాలో దీపావ‌ళి ప‌ట్ట‌లేని ఆనందంలో ప్రియాంక‌!

Update: 2022-10-24 07:41 GMT
దివ్వి  దివ్వి దీపావ‌ళి అంటే పిల్ల‌ల్లో ప‌ట్ట‌లేని ఆనందం. పండుగ వారం ముందు నుంచే తుపాకుల మోత‌.. మతాబుల..సిసింద్రీల తాయారీ మొద‌ల‌వుతుంది. వాటిని సాయంత్రం వేళ‌ల్లో కాల్చ‌డం జ‌రుగుతుంది. ఇప్ప‌టికీ ఈ  విధానం భార‌త‌దేశంలో  కొన‌సాగుతుంది. మ‌రికొంత మంది పెద్ద‌లు సైతం దీపాల పండ‌గొచ్చేస‌రికి పిల్ల‌లైపోతారు. ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు దీపాల పండుగ‌కి ఉన్నాయి.

ఇక తెలుగు నేల‌గా మారిపోతున్న అమెరికాలోనూ ప్ర‌తీ ఏడాది దీపాల పండుగ  ఘ‌నంగా జ‌రుగుతోంది. అమెరికాలో స్థిర‌ప‌డిన భార‌తీయులు ఏటా ఎంతో ఘ‌నంగా ఈ వేడుక‌ను నిర్వ‌హించుకుంటారు. ఇంకా భార‌తీయ పండుగ‌ల‌న్నీ  ఇంగ్లీష్ గ‌డ్డ‌పై త‌రుచూ జ‌రుగుతూనే ఉంటాయి. అలా ఇక్క‌డి సంప్ర‌దాయాలు అమెరికాకు అల‌వాటుగా మారిపోతున్నాయి.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి అమెరికా ప్ర‌భుత్వం సెల‌వు కూడా ప్రక‌టించాల‌ని అనుకుంటుంది. దీనిక సంబంధించి చ‌ట్టం కూడా చేయాలనుకుంటున్నారు. ఇప్ప‌టికే బిల్లు పెట్ట‌డం జ‌రిగింది. అది చ ట్టంగా మారితే వ‌చ్చే ఏడాది నుంచి సె ల‌వు ప్ర‌క‌టించాల‌ని ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోంది.  ఈనేప‌థ్యంలో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా దీపాల పండుగ‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ఒక్కసారిగా  త‌న చిన్న నాటి  అమెరికా జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోయారు. 'న్యూయార్క్ లో మ‌న పండ‌క్కి  సెల‌వు ప్ర‌క‌టిచండంతో చాలా సంతోషంగా ఉంది.  నా క‌ళ్లు ఒక్క‌సారిగా చెమ‌ర్చాయి. నేను టీనేజ్ లో ఉన్న‌ప్పుడు వాళ్ల బంధువుల ఇళ్ల‌లో ఉంటూ  లాస్ ఎంజెల్స్..అయోవా..మ‌సాచ్యు సెట్స్ న‌గ‌రాల్లో చుదువుకున్నాను. ఆ స‌మ‌యంలో స‌హ‌చ‌రుల‌తో ప్ర‌తీ ఏడాది దీపావ‌ళ‌ఙ ఘ‌నంగా జ‌రుపుకునే దాన్ని.

ఇప్పుడు మ‌న పండ‌క్కి సెల‌వులు ఇవ్వ‌డం చూస్తుంటే దీపావ‌ళి ప్రాశ‌స్త్యం గురించి విద్యార్ధులంద‌రికీ తెలియ‌జేయాలి. మ‌న‌లోని అజ్ఞాన‌..అంధ‌కారాల‌ను పార‌దోలి  జీవితాల్లో ఎలా వెలుగులు నింపుకోవాలో నేర్పించాలి' అని అన్నారు. పీసీ నిక్ జోనాస్ని వివాహం చేసుకుని అమెరికా కోడులు అయిన సంగ‌తి  తెలిసిందే.

వివాహం అనంత‌రం అమెరికాలోనే స్థిర‌ప‌డింది. విదేశాల్లో భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెడుతోంది. హోట‌ల్ బిజినెస్ రంగంలో రాణిస్తోంది.  అలాగే న‌టిగాను దీపిక దూసుకుపోతుంది. హాలీవు్డ్ తో పాటు బాలీవుడ్ లోనూ వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. ఇంకోవైపు బ్రాండ్ అంబాసిడ‌ర్ గానూ స‌త్తా చాటుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News