టాలీవుడ్ లో ఒక హీరో సినిమా ఫంక్షన్ కు మరో హీరో గెస్ట్ గా రావడం.. ఒకరి చిత్రాలను మరొకరు ప్రమోట్ చేయడం మనం చాలా కాలంగా చూస్తున్నాం. అయితే పాండమిక్ తర్వాత ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బిగ్ స్టార్స్ సైతం ఇతర హీరోల చిత్రాలకు సపోర్ట్ గా నిలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల కాలంలో పలువురు సూపర్ స్టార్ హీరోలు ఇతర చిన్న - మీడియం రేంజ్ మరియు బిలో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ను తమ చేతుల మీదుగా రిలీజ్ చేయడమే కాదు.. సినిమా ఫంక్షన్స్ కు కూడా హాజరవుతున్నారు.
స్టార్ హీరోలు ఇలా ప్రచార కార్యక్రమాల్లో భాగం అవుతుండటం వల్ల.. అది చిన్న సినిమా అయినా సరే జనాల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. అలానే సూపర్ స్టార్ల ఫ్యాన్ బేస్ సైతం ఈ మీడియం స్టార్ హీరోల సినిమాలకు ఆకర్షితులవుతారు.. థియేటర్లకు వస్తారు.
ఫలితంగా కంటెంట్ ఎలా ఉన్నా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. దీనికి తగ్గట్టుగా మౌత్ టాక్ కూడా బాగుంటే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సినిమాగా నిలిచే అవకాశం ఉంటుంది. అగ్ర హీరోల క్రేజ్ ఈ విధంగా తమ సినిమాలకు హెల్ప్ అవుతుంది కాబట్టి.. మీడియం స్టార్స్ అంతా సూపర్ స్టార్స్ తమ ఫంక్షన్ కు వచ్చి, సపోర్ట్ చేయాలని రిక్వెస్టు చేస్తున్నారు.
ఇలా చిన్న హీరోల సినిమాల వేడుకలకు అతిధులుగా రావడం వల్ల సూపర్ స్టార్లకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఇతర హీరోల సినిమాలను ప్రమోట్ చేయడం వల్ల వారి ఇమేజ్ రెట్టింపు అవుతుంది. ఈవెంట్ లో ఎలాగూ వారినే పొగుడుతూ ఉంటారు కాబట్టి.. అది కూడా వాళ్లకి పబ్లిసిటీగా ఉపయోగపడుతుంది.
మరో విషయం ఏంటంటే.. చిన్న మీడియం రేంజ్ హీరోల సినిమాలను జనాల్లోకి తీసుకెళ్ళడానికి స్టార్ హీరోల అవసరం ఉంటుంది కానీ.. అదే స్టార్లు నటించే చిత్రాలకు ఎలాంటి ప్రమోషన్లు.. పబ్లిసిటీ అవసరం లేదు. వాళ్ళ పేరు చూస్తే చాలు.. ఎలాంటి చిత్రమైనా ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ ఇక్కడ థియరీ వేరుగా కనిపిస్తోంది.
అగ్ర హీరోలే తమ సినిమాల ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు చేయిస్తున్నారు. సినిమా మేకింగ్ కు భారీ బడ్జెట్ పెట్టినట్లుగానే.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ - ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ భారీగా ఖర్చు చేయిస్తున్నారు. సినిమా చిన్నదైనా పెద్దదైనా ప్రచారం అవసరమని చెబుతూ ఫంక్షన్స్ కోసం నిర్మాతలతో విపరీతంగా ఖర్చు చేయిస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.