అక్కని...చెల్లిని సార్ అలా బ్యాలెన్స్ చేస్తున్నారా?
జాన్వీ కపూర్ ని డాడ్ బోనీ కపూర్ తొలుత కోలీవుడ్ లో లాంచ్ చేయాలని చూసారు. కొంత మంది హీరోలు, దర్శకుల్ని కూడా పరిశీలించారు.
జాన్వీ కపూర్ ని డాడ్ బోనీ కపూర్ తొలుత కోలీవుడ్ లో లాంచ్ చేయాలని చూసారు. కొంత మంది హీరోలు, దర్శకుల్ని కూడా పరిశీలించారు. కానీ ఎందుకనో ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అప్పటికే టాలీవుడ్ పాన్ ఇండియాలో రాజ్యమేలుతుంది. దీంతో కోలీవుడ్ కంటే? టాలీవుడ్ బెటర్ అనుకున్నారో ఏమో గానీ చివరికి `దేవర`తో టాలీవుడ్ లో లాంచ్ అయింది. అలా బోనీ కపూర్ కోలీవుడ్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు.
ఈ నేపథ్యంలో బోనీ కపూర్ చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ని తమిళ్ లో లాంచింగ్ దిశగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఖుషీ కపూర్ ఇప్పటికే హిందీలో లాంచ్ అయింది. ఇబ్రహీం అలీఖాన్ తో ఓ సినిమా చేస్తుంది. ఇదే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కు వస్తుంది. అయితే ఆ రిలీజ్ తో సంబంధం లేకుండా బోనీ కపూర్ కోలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే బోనీ మణిరత్నంతో సమావేశమయ్యారుట. ఆ సమావేశంలో చిన్న కుమార్తె ప్రస్తావన తీసు కొచ్చినట్లు సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో లాంచ్ అయితే బాగుంటుందనే ప్రపోజల్ పెట్టారుట. అందుకు మణిరత్నం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నవభామల్ని పరిచయం చేయడం మణిరత్నం కి కొత్తేం కాదు. ఎంతో మంది ని హీరోయిన్లగా తీర్చిదిద్దారు.
ఈ నేపథ్యంలో అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తెను ఎందుకు కాదంటారు? ప్రస్తుతం మణిరత్నం `థగ్ లైఫ్` తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే తన మార్క్ ఓ అందమైన ప్రేమ కథని తెరకె క్కిస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో కొత్తవారే కనిపిస్తారని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ ఛాన్స్ ఖుషీ కపూర్ దే కావొచ్చు. ఇదే నిజమతైతే అక్కని...చెల్లిని సౌత్ ఇండస్ట్రీలో బోనీ కపూర్ అలా బ్యాలెన్స్ చేసినట్లే .