41 వయసులోను అందాల త్రిష అదే జోరు
వయసు, మారుతున్న కాలంతో సంబంధం లేకుండా స్టార్ డమ్ ని ఆస్వాధించే నటీమణులు చాలా అరుదు. 40 వయసులోను త్రిష ఇప్పటికీ క్యూట్ గా అందంగా కనిపిస్తోంది.
వయసు, మారుతున్న కాలంతో సంబంధం లేకుండా స్టార్ డమ్ ని ఆస్వాధించే నటీమణులు చాలా అరుదు. 40 వయసులోను త్రిష ఇప్పటికీ క్యూట్ గా అందంగా కనిపిస్తోంది. ఇప్పటికీ త్రిషకు ఉన్న ఫాలోయింగ్ చెక్కు చెదరలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా, ఈ భామ బ్యాక్ టు బ్యాక్ అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.
ఇటీవల పొన్నియన్ సెల్వన్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న త్రిష తదుపరి పలు తమిళ ప్రాజెక్టులలో ఆఫర్లను అందుకుంది. తళా అజిత్ తో విదాముయార్చి (తెలుగులో పట్టుదల) లో నటించింది. ఈ సినిమా ఇటీవలే విడుదలై, ఆశించిన విజయం సాధించకపోవడం నిరాశపరిచింది. తదుపరి కమల్ హాసన్ థగ్ లైఫ్ లో ను త్రిష కనిపించనుంది.
తెలుగులో విశ్వంభర లో మెగాస్టార్ చిరంజీవి సరసనా కథానాయికగా నటిస్తోంది.
అజిత్‌తో సినిమా ఫ్లాపైనా కానీ, ప్రస్తుతం చిరంజీవి, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోల సరసన త్రిష నటిస్తోంది. ఈ రెండూ తన కెరీర్ లో కీలకమైన సినిమాలు. ఈ రెండిటిపైనా భారీ అంచనాలున్నాయి. ఇవి బ్లాక్ బస్టర్లు సాధిస్తే త్రిషకు మరో ఐదారేళ్ల పాటు వెనుదిరిగి చూసుకునే పనే లేదు. మరోవైపు విజయ్ సేతుపతితో కలిసి తన బ్లాక్ బస్టర్ సినిమా 96 కి సీక్వెల్ లోను నటిస్తుందని కథనాలొస్తున్నాయి. అయితే ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.