DSP ఆల్బ‌మ్: రాక్ స్టార్ నుంచి చాలా ఆశిస్తే..!

Update: 2022-10-05 03:43 GMT
టాలీవుడ్ టు బాలీవుడ్ DSP గురించి తెలియ‌ని వారు లేరు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియ‌న్ డ‌యాస్పోరా(భార‌తీయులు నివ‌శించే చోట‌)లో దేవీశ్రీ‌కి వీరాభిమానులున్నారు. అత‌డి సంగీతం ఎల్ల‌లు దాటింది. స‌రిహ‌ద్దులు దాటి విదేశాల్లోనూ ప్రేమాభిమానాలు అందుకుంది. అమెరికా స‌హా విదేశాల్లో మ్యూజిక్ టూర్ల పేరుతో దేవీశ్రీ బోలెడంత పాపులారిటీ సంపాదించాడు. అందుకే ఇప్పుడు తొలిసారిగా ఒక పాప్ ఆల్బ‌మ్ తో వ‌స్తున్నాడు అంటే దానిపై భారీ అంచ‌నాలేర్ప‌డ‌తాయి.

తాజాగా దేవీశ్రీ 'ఓ పారి' పాప్ ఆల్బ‌మ్ రానే వ‌చ్చింది. దేవీ కెరీర్ లో తొలిసారి ఇలాంటి ప్ర‌య‌త్నం చేసాడు. కొంద‌రు అంద‌మైన విదేశీ మోడల్స్ న‌డుమ రాకింగ్ స్టార్ దేవీశ్రీ స్టెప్పులు వేస్తూ గానాలాప‌న చేస్తూ బోలెడంత సంద‌డి చేసాడు. ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ డిజైన్ స‌హా గానం సంగీతం ప్రొడ‌క్ష‌న్ స‌హా ప్ర‌తిదీ తానే బాధ్య‌త వ‌హించాడు. విజువ‌ల్స్ ఎంతో రిచ్ గా క‌నిపించాయి. దీనిని స్పెయిన్- అమెరికా- ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు అద్భుతంగా అనిపించాయి.

కానీ దేవీశ్రీ అభిమానుల‌కు ఇది వంద శాతం సంతృప్తిని ఇవ్వ‌లేదు. మ‌గువ గురించి వ‌ర్ణిస్తూ ఒక సాధా సీదా లిరిక్ ని ఎంచుకున్నాడు. అంతే సాధా సీదాగా కొరియోగ్ర‌ఫీ కూడా ఆక‌ర్షించ‌లేక‌పోయింది.

అల్ట్రా మోడ్ర‌న్ సోష‌ల్ మీడియా యుగంలో సాధార‌ణ యువ‌కులు కూడా ఒక పాప్ స్టార్ రేంజులో చెల‌రేగుతూ స్టెప్పులు వేస్తూ చాలా రీమిక్సులు చేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో మిరాకిల్స్ చేస్తున్నారు. కానీ దేవీశ్రీ ఎందుక‌ని ఇలాంటి చ‌ప్ప‌గా సాగే ఒక ఆల్బ‌మ్ ని ఎంచుకున్నారు? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కం.

నిజానికి దేవీశ్రీ త‌లుచుకుంటే యోయో హ‌నీ సింగ్- బాద్ షాల‌ను మించి చేయ‌గ‌ల‌డు. స్వ‌రం కూర్పు స‌హా తానే స్వ‌యంగా పాట పాడాల‌ని అనుకోవ‌డం అన్ని బాధ్య‌త‌లు త‌నే నిర్వ‌హించ‌డం స‌రికాద‌ని అనిపించింది. కానీ ఈ పాట‌లో టీనేజ‌ర్ల‌కు క‌నెక్ట‌య్యే ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయ‌ని చెప్పాలి. ఇక లిరిక్స్ లో కూడా మీనింగ్ పూర్తి రివ‌ర్ట్ గా అనిపిస్తుంది. ఓవైపు ఓ పారి అని పాడుతూనే హ‌రే రామ హ‌రే కృష్ణ‌! అంటూ దేవీశ్రీ ఏం చెప్ప‌ద‌లిచాడో అర్థం కాదు. దేవీశ్రీ‌ స్టిల్ బ్యాచిల‌ర్. త‌న ఉద్ధేశాల‌ను ఈ పాట ద్వారా తెలియ‌జేస్తున్నాడా? అన్న‌ది త‌ర‌చి చూడాలి.

DSP తన సోలో అరంగేట్రం కోసం ఇంత సరళమైన పాటను ఎందుకు ఎంచుకున్నాడు? అన్న ప్ర‌శ్నకు అత‌డు స‌మాధానం చెప్పాల్సి ఉంది. ఒక అమ్మాయి గురించి అందమైన వయస్సు గురించి పాడాల‌నుకుంటే ఇంకా ఇంకా అత‌డు చాలా మ్యాజిక్ చేయ‌గ‌ల‌డు. కానీ త‌న స్థాయిలో ఇది లేద‌నే చెప్పాలి. తొంబైల నాటి పాట‌ల స్ఫూర్తితో రొటీన్ విజువ‌ల్స్ తో అత‌డు నీరుగార్చాడు. ఎంపిక చేసుకున్న లొకేష‌న్లు ప్రొడ‌క్ష‌న్ డిజైన్ కొంత‌మేర ఆక‌ర్షించాయి.

దేవీశ్రీ నుంచి చాలా ఆశిస్తే ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో అత‌డు విఫ‌ల‌మ‌య్యాడ‌నే చెప్పాలి. ఎవ‌రైనా పాప్ ఆల్బ‌మ్స్ లేదా ఇంకేవైనా రూపొందించాలంటే ఇప్ప‌టికే టాప్ ర్యాప‌ర్స్ పాప్ స్టార్స్ రూపొందించిన ఆల్బ‌మ్స్ ని మించి ఏదైనా కొత్త‌గా గ‌మ్మ‌త్తుగా చేయాలి. లేదంటే అవి నీరు గారిపోతాయి. ఇక గ‌ల్లీబోయ్ చిత్రంలో ర్యాప్ విన్న‌వాళ్లు మ‌ళ్లీ మ‌ళ్లీ అలాంటివి కోరుకుంటారు. దేవీశ్రీ ఎన‌ర్జీ ఆ రేంజులో వ‌ర్క‌వుటై ఉంటే బావుండేద‌ని తెలుగు అభిమానులు కోరుకున్నారు. కానీ దేవీ అది చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News