క‌రోనా ప్యార్ హై..టైటిల్ రిజిస్ట‌ర్ చేసిన పెద్ద నిర్మాణ సంస్థ‌!

Update: 2020-03-18 03:30 GMT
ఒక‌వైపు ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా ఆందోళ‌న‌లు ప‌తాక స్థాయిలో ఉన్నాయి. చైనాలో పుట్టిన ఈ వైర‌స్ ఇప్పుడు ప్రపంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తూ ఉంది. ఇప్ప‌టికే ఈ వైర‌స్ ప్ర‌భావంతో ఐదు వేల మంది వ‌ర‌కూ మ‌ర‌ణించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంకా అనేక మందికి ఈ వైర‌స్ సోకి ఉంద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. వారికి చికిత్స అందుతూ ఉంది. అయితే ఈ వైర‌స్ తీవ్ర‌త గురించి ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

మొద‌ట్లో క‌రోనా గురించి జోకులు వేసిన వారు కూడా ఇప్పుడు కామ్ అవుతున్నారు. క‌రోనా ప్ర‌భావం చైనాకు మాత్ర‌మే ప‌రిమితం అయిన‌ప్పుడు కొంద‌రు ఆ వైర‌స్ మీద జోకులు వేశారు. ఆ వైర‌స్ అంటుకోవ‌డం గురించి కామెడీ చేశారు. అయితే ఆ వైర‌స్ చైనాను దాటి వేరే దేశాల‌కూ చేరింది. వివిధ దేశాల్లో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. ఇంకా అనేక మంది ఆ వైర‌స్ తో ఇబ్బంది ప‌డుతూ ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి క్ర‌మంలో క‌రోనా మీద కామెడీ త‌గ్గింది. సీరియ‌స్ గా క‌రోనా మీద ఇప్పుడు ప్ర‌పంచం దృష్టి పెట్టింది. దాని నివార‌ణ‌కు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

మ‌రి ఒక‌వైపు ఇలాంటి ప‌రిస్థితి ఉంటే..ఒక బ‌డా నిర్మాణ సంస్థ మాత్రం క‌రోనాతో కామెడీలు చేస్తూ ఉంది. పేరెన్నిక గ‌ల నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ *క‌రోనా ప్యార్ హై* అంటూ ఒక సినిమా టైటిల్ ను రిజిస్ట‌ర్ చేయించింది. బాలీవుడ్ లో *క‌హోనా ప్యార్ హై* అంటూ ఒక సూప‌ర్ హిట్ సినిమా ఉంది క‌దా, దాని స్ఫూర్తితో, స్ఫూగా క‌రోనా ఫ్యార్ హై అంటూ టైటిల్ ను రిజిస్ట‌ర్ చేయించార‌ట‌. అంతే కాదు.. ఈ టైటిల్ తో సినిమాను రూపొందించ‌బోతున్న‌ట్టుగా దానికీ, క‌హోనా ప్యార్ హై సినిమాకూ సంబంధం లేద‌ని ఈరోస్ ప్ర‌క‌టించింది. దీనిపై విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు.

ఈ విష‌యంలో క‌హోనా ప్యార్ హై ద‌ర్శ‌కుడు రాకేష్ రోష‌న్ కూడా స్పందించారు.క‌రోనా ప్యార్ హై అంటూ టైటిల్ రిజిస్ట‌ర్ చేయించ‌డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. అది ఒక పిల్ల చేష్ట అంటూ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News