సైరా సందడి మొదలైపోయింది. చిరు గెటప్ ఎలా ఉంటుంది అని రివీల్ చేయటం కోసం ఉద్దేశించిన టీజర్ మెగా ఫ్యాన్స్ ని పూర్తిగా సంతృప్తిపరిచినా బయట మాత్రం కాస్త మిశ్రమ స్పందన తెచ్చుకున్నది నిజం. ఈవెంట్ లో చరణ్ మాట్లాడుతూ వచ్చే సమ్మర్ లో విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు కానీ సైరాకు రానున్న రోజుల్లో చాలా కఠినమైన సవాళ్లు ఉన్నాయి. ఇప్పటికే టీజర్ లో షాట్స్ బాహుబలి రుద్రమదేవి మగధీర లాంటివాటిని తలపించాయని కామెంట్స్ విన్పిస్తున్న నేపధ్యంలో దాన్ని బట్టి బజ్ పెరగడం తగ్గడం జరగదు. కానీ ఇంకా బాగా ఎలివేట్ చేయాల్సిన రేంజ్ లో టీజర్ కట్ చేయాల్సి ఉండేది అన్న అభిప్రాయం మాత్రం పుట్టిన రోజు వేడి కాస్త చల్లారాక వినిపించిన మాట. అదలా ఉంచితే సైరా షూటింగ్ ఇంకా 40 శాతం కూడా పూర్తి కాలేదని ఇన్ సైడ్ టాక్. విజయ్ సేతుపతి ఎంట్రీ జరగనే లేదు. సుదీప్ తో ఓ పది రోజుల షూటింగ్ చేసారు కానీ మిగిలిన ఆర్టిస్టులతో కాంబినేషన్ సీన్లు ఇంకా బాలన్స్ ఉన్నట్టు తెలిసింది. నయనతార కాల్ షీట్స్ చూసుకుని ఎప్పటికప్పుడు తనతో ఉన్న సీన్లు వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. పైగా సమ్మర్ రిలీజ్ అనుకుంటే చేతిలో మహా అంటే ఓ ఎనిమిది నెలల సమయం ఉంది. అందులోనే పోస్ట్ ప్రొడక్షన్ తో సహా గ్రాఫిక్ వర్క్ కూడా పూర్తి చేయాలి.
సంగీత దర్శకుడు అమిత్ తివారి ఈ మధ్యే జాయిన్ అయ్యాడు. ఇప్పటికి క్లైమాక్స్ సాంగ్ ట్యూన్ ఒక్కటే ఓకే అయ్యింది. ఇంకా మిగిలిన పాటల కంపోజింగ్ రీ రికార్డింగ్ వాటి చిత్రీకరణ ఇంకా చాలా పనుంది. పైగా చిరు వయో భారం వల్ల కాస్త అలుపు కనిపిస్తున్న మాట నిజం. గీత గోవిందం సక్సెస్ మీట్ లో పలుమార్లు చిన్నపాటి ఆయాసంతో స్పీచ్ కు మధ్యలో బ్రేక్ ఇచ్చి నీళ్లు తాగడం చెమట తుడుచుకోవడం చేసారు. 60 వయసు దాటాక ఇలాంటి ఇబ్బందులు ఎంతటివారికైనా సహజం. అందులోనూ తెల్లవారుఝామున 3 గంటల దాకా షూటింగ్ చేయటం చిరు ఆరోగ్యం మీద కాస్త ప్రభావం చూపేలా ఉండటంతో దర్శకుడు సురేందర్ రెడ్డి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఒత్తిడి లేకుండా షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇది 200 కోట్ల బడ్జెట్ సినిమా అనిపించేలా ఉండాలంటే టీజర్లో చూపించిన విజువల్స్ సరిపోవు. ఇంకా గ్రాండ్ గా ఉండాలి. షూటింగ్ ఆ స్థాయిలో జరగలేదు కాబట్టి ఇంత ముందుగా ఆశించడం కూడా అత్యాశే. ట్రైలర్ వదిలే సమయానికి వాటిని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. సో అడ్డంకులన్నీ తొలగి ఎక్కడా బ్రేక్ లేకుండా షూటింగ్ జరిగితేనే సైరా చెప్పిన టైంకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే వచ్చే బర్త్ డేకు తప్ప అంతకు ముందు వచ్చే ఛాన్స్ లేదని ఇన్ సైడ్ టాక్. మరి ఈ సవాళ్లు దాటుకుని సైరాను టైంకు తీసుకురావడం చిరు చరణ్ లకు ఇద్దరికీ ఛాలెంజే.