RRR నిర్మాత‌పై తీవ్ర‌ ఒత్తిడి.. కార‌ణ‌మిదే!

Update: 2021-06-11 10:30 GMT
2021-22 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ మూవీగా RRR రికార్డుల‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ - రామారావు క‌ల‌యిక‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న అత్యంత భారీ చిత్ర‌మిది. తెలుగు-త‌మిళం-హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత‌ భారీగా రిలీజ్ కానుంది. ఈ  సినిమా కోసం డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత డీవీవీ దాన‌య్య ఏకంగా 300-400 కోట్ల మేర బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇప్ప‌టికే అత్యంత భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ సాగించార‌ని కూడా ప్ర‌చార‌మైంది.

కానీ తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం.. ఆర్.ఆర్.ఆర్ స‌కాలంలో రిలీజ్ కి రాక‌పోవ‌డంతో ఆ ప్ర‌భావం నిర్మాత దాన‌య్య‌పై ప‌డింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అప్పుల‌పై వ‌డ్డీల భారం త‌ల‌కుమించిన భారంగా మారింద‌ని ఇప్ప‌టికే ఫైనాన్షియ‌ర్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర‌వుతోంద‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ఓ ఇద్ద‌రు ఫైనాన్షియ‌ర్ల నుంచి భారీ మొత్తాల్ని ఫైనాన్స్ తీసుకోగా వారి నుంచి ఒత్తిడి పెరుగుతోందిట.

క‌రోనా మొద‌టి వేవ్ తో అంతం కాకుండా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చ‌డంతో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీ ప‌లుమార్లు వాయిదా ప‌డింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ ఉన్నా సంక్రాంతి వ‌ర‌కూ వీలుప‌డ‌క‌పోవ‌చ్చ‌న్న క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అంత‌కంత‌కు ఆల‌స్యం కావ‌డం అప్పుల‌పై వ‌డ్డీలు పెంచుతోంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఏదేమైనా ఆర్.ఆర్.ఆర్ జాతీయ స్థాయిలో ఉత్త‌మ ప్రాజెక్ట్ కానుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. తాజా గుస‌గుస‌ల‌పై నిర్మాత‌లు స్పందిస్తారేమో వేచి చూడాలి.
Tags:    

Similar News