అల్లు అర్జున్, త్రివిక్రమ్.. అసలు అప్డేట్ అప్పుడే..

రీసెంట్ ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యి అద్భుతమైన ఆదరణతో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

Update: 2025-02-03 07:12 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'తో కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీలో అన్ని రకాల రికార్డులని తిరగరాసింది. తెలుగులో 'బాహుబలి 2' పేరు మీద ఉన్న రికార్డులని సైతం లాగేసుకుంది. రీసెంట్ ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యి అద్భుతమైన ఆదరణతో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మెల్లగా 'పుష్ప 2' మూడ్ నుంచి బయటకొచ్చి త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీకి సిద్ధం కాబోతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ అండ్ టీమ్ ఈ సినిమాకి సంబందించిన పనులని మొదలు పెట్టింది. మైథలాజికల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 500 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారంట.

అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ కూడా 'పుష్ప 2' తర్వాత పెరిగింది. ముఖ్యంగా నార్త్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బన్నీపై నెక్స్ట్ ఎంత బడ్జెట్ పెట్టిన కచ్చితంగా రికవరీ వస్తుందనే నమ్మకం మేకర్స్ లో ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ అనే ఇమేజ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ఇప్పుడు బయటకొచ్చింది.

ఈ సినిమాని ఉగాదికి గ్రాండ్ గా ఎనౌన్స్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకుంటున్నారంట. 'అజ్ఞాతవాసి' సినిమాతో అనిరుద్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఈ సినిమా సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చిన మూవీ కమర్షియల్ డిజాస్టర్ గా మారింది.

దీని తర్వాత 'అరవింద సమేత' సినిమా కోసం త్రివిక్రమ్ మరల అనిరుద్ ని తీసుకోవాలని తీసుకున్నారు. తరువాత ఏమైందో ఆ స్థానంలోకి థమన్ వచ్చారు. అయితే అనిరుద్ ప్రస్తుతం పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి జోరుమీద ఉన్నాడు. వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నారు. అతను మ్యూజిక్ అందిస్తున్న సినిమాలన్నీ మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి అనిరుద్ తో వర్క్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 'AA 22' సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా అతనిని ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు ఎదురుచూడాల్సిందే.

Tags:    

Similar News