అల‌నాటి అందాల తార జీవితంలో బోల్డ్ బ్యూటీ!

అటిట్యూడ్..ప్లూయెంట్ ఇంగ్లీష్.. కంప్లీట్ క్లారిటీతో ప‌ర్వీన్ బాబి ఉత్తుంగ త‌రంగం మోడ‌లింగ్ నుంచి బాలీవుడ్ కి అడుగు పెట్టింది. తొలి సినిమా ప్లాప్.

Update: 2025-02-03 07:30 GMT

బాలీవుడ్ కు గ్లామ‌ర్ అద్దిన న‌టి..హీరోయిన్ కు అదా నేర్పిన భామ ప‌ర్వీన్ బాబి. వెండి తెర‌పై ప‌ర్వీన్ విసిరిన చూపుల‌ను..ఒలికించిన న‌వ్వుల‌ను ఏరికోవ‌డానికి అప్ప‌ట్లో యువ‌త థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెట్టేది. అప్ప‌టి బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనూ ప‌ర్వీన్ ఆరాద‌కులు త‌క్కువేం కాదు. అటిట్యూడ్..ప్లూయెంట్ ఇంగ్లీష్.. కంప్లీట్ క్లారిటీతో ప‌ర్వీన్ బాబి ఉత్తుంగ త‌రంగం మోడ‌లింగ్ నుంచి బాలీవుడ్ కి అడుగు పెట్టింది. తొలి సినిమా ప్లాప్.

కానీ నిర్మాత‌లు ఆమె కోసం క్యూ క‌ట్టేవారు. కాల్షీట్ల కోసం పోటీ ప‌డేవారు. ప‌ర్వీన్ బాబి అందం అలాంటింది మ‌రి. ఆమె రాక‌తో బాలీవుడ్ కి కొత్త శోభ తోడైంది. న‌టిగా ఓ వెలుగు వెలిగింది. అలాగే ప్రేమాయ‌ణాలు న‌డ‌ప‌డంలోనూ అంతే సంచ‌ల‌మైంది. అప్ప‌ట్లోనే లివ్ ఇన్ రిలేష‌న్ షిప్ లు నెరిపిన న‌టి. విదేశీ ప‌త్రిక‌లు సైతం ప‌ర్వీన్ గురించి ఎన్నో సంచ‌ల‌న క‌థ‌నాలు ప్ర‌చురించాయి. అలా వ‌రల్డ్ అంతా కూడా ఫేమ‌స్ అయింది.

70-80వ ద‌శ‌కంలో బాలీవుడ్ నే ఏలిన న‌టి. అలాంటి సంచ‌ల‌న న‌టి జీవిత క‌థ ఇప్పుడు వెండి తెర‌కు ఎక్క‌బోతుంది. కొంత కాలంగా ప‌ర్వీన్ బ‌యోపిక్ తెర‌కెక్కుతోందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ అందులో వాస్త‌వం క‌నిపించ‌లేదు. అయితే ఇప్పుడామె క‌థ‌ను సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆమె పాత్ర‌లో న‌టించ‌డానికి బాలీవుడ్ యువ సంచ‌ల‌నం త్రిప్తీ డిమ్రీని ఎంపిక చేసారు.

షోనాలీ బోస్ ఇమేజిన్ లో కేవ‌లం త్రిప్తీ మాత్ర‌మే క‌నిపించ‌డంతో? ఆ ఛాన్స్ ఆమెకే వ‌రించింది. ప‌ర్వీన్ బాబి పీచ‌ర్లు కొన్ని త్రిప్తీలో ఉన్నాయ‌నే కాన్పిడెన్స్ తో షోనాలి ఎంపిక చేసిన‌ట్లు చెబుతున్నారు. ప్ర‌సుతం యూత్ పుల్ బ్యూటీగానూ త్రిప్తీ డిమ్రీ సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. అలా ఆ రెండు క్వాలిటీలో త్రీప్తి ఈ లెజెండ్ జీవితంలో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ద‌శ‌లో ఉంది. మ‌రికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభ‌మ‌తుంద‌ని స‌మాచారం.

Tags:    

Similar News