నేను ఇడ్లీ బ్యూటీని..మూడు పూటలైనా నో ప్రోబ్లమ్!
సంవత్సరాలుగా సినిమాలు సెట్స్ లో షూటింగ్ దశలోనే ఉన్నాయి.
నిధి అగర్వాల్ కెరీర్ లో నెమ్మదిగా సాగుతోన్న సంగతి తెలిసిందే. చెప్పుకోవడానికి చేతిలో 'హరి హర వీరమల్లు', 'రాజాసాబ్' లాంటి అగ్ర హీరోల చిత్రాలున్నా? వాటి రిలీజ్ విషయానికి వచ్చే సరికే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. సంవత్సరాలుగా సినిమాలు సెట్స్ లో షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ లపై నిధి చాలా ఆశలు పెట్టుకుంది. వాటితో సక్సెస్ అందుకుని బిజీ భామగా మారాలని చూస్తోంది. మరి ఈ ప్రయత్నం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
రెండు సినిమాలపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. సక్సెస్ అయితే నిధి కి కలిసొచ్చే అవకాశాలు ఎక్కువ గానే ఉన్నాయి. ఆ సంగతి పక్కన బెడితే తాజాగా నిధి అగర్వాల్ కి ఇడ్లీ అంటే ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో బయటకు వచ్చింది. ఆహార పదార్దాల్లో ఏది ఇష్టం అంటే? అమ్మడు వెంటనే ఇడ్లీ అని సమాధానం ఇచ్చింది. ఇడ్లీ ఉదయమే కాదు..మధ్యాహ్నం లంచ్ లో ...రాత్రి డిన్నర్ లో పెట్టినా ఇష్టంగా ఆరగిస్తుందిట.
ఇంట్లో ఇడ్లీ ఉంటే ఇంకే పదార్దాలు అవసరం లేదుట. మూడు పూటలు ఇడ్లీ తినేసి సంతోషంగా ఉంటానంటోంది. సాధారణంగా ఇడ్లీ అంటే చాలా మంది ఇష్టడరు. కానీ నిధి అగర్వాల్ మాత్రం అలాంటి వాళ్లకు భిన్నం అంటోంది. ఇడ్లీ ఆరోగ్యానికి మంచిందంటోంది. ఇడ్లీ ఎక్కడ చూసినా నోరూరిపోతుందిట. ఇడ్లీ తర్వాత ప్రెంచ్ ప్రైస్ వీక్ నెస్ గా చెప్పుకొచ్చింది. డైటింగ్ వల్ల వాటికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు చాలా బాధపడుతుందిట.
డైట్ ఎప్పుడు అయిపోతుందా? అని ఆత్రంగా ఎదురు చూస్తోందిట. అలాగని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయనంటోంది. తాను తీసుకోవాల్సిన ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకుంటానని తెలిపింది. నిధి ఇడ్లీ ఇష్టపడినట్లే కీర్తి సురేష్ దోశెలను ఇష్టపడుతుంది. వంద రకాల బ్రేక్ పాస్ట్ లు ముందు పెట్టినా దోశె తిన్నంతగా ఇంకేమీ తినని గతంలో తెలిపింది. మరి అలాంటి ఇడ్లీ-దోశె భామలు ఇంకెంత మంది ఉన్నారో.