అవును, నాకు పొగ‌రుంది: ఇళ‌య‌రాజా

అలాంటి ఇళ‌య‌రాజా రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Update: 2025-02-03 09:43 GMT

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌యారాజాకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆయ‌న మ్యూజిక్ కోసం చెవులు కోసుకునే వాళ్లున్నారంటే అతిశ‌యోక్తి లేదు. ఆనాటి కాలం నుంచి ఇప్పుడు న‌డుస్తున్న 5జీ జెన‌రేష‌న్ సంగీత ప్రియుల వ‌ర‌కు అంద‌రూ ఆయ‌న సంగీతం గురించి గొప్ప‌గా చెప్తుంటారు. ఎన్నో భాష‌ల్లో ఎవ‌ర్‌గ్రీన్ ఆల్బ‌మ్స్ ఇచ్చిన ఆయ‌న గురించి, ఆయ‌న సంగీతం గురించి ఎంత చెప్పినా త‌క్కువే .

మ్యూజిక్ జ‌ర్నీలో ఇళ‌యరాజా అందుకున్న అవార్డుల‌కు లెక్కే లేదు. అన్న‌కిలి అనే సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన ఆయ‌న త‌ర్వాత 1500ల‌కు పైగా సినిమాల‌కు సంగీతాన్ని అందించారు. 7 వేల‌కు పైగా పాట‌లు రాశాడు. అంతేకాదు కేవ‌లం 35 రోజుల్లో సింపోనిని రూపొందించ‌వ‌చ్చ‌ని ఇళ‌య‌రాజా నిరూపించాడు.

అలాంటి ఇళ‌య‌రాజా రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తాను మ్యూజిక్ ఇచ్చిన ప‌లు సాంగ్స్ ద్వారా వెస్ట్ర‌న్ క్లాసిక‌ల్ సంగీతాన్ని ప‌రిచ‌యం చేసి అంద‌రికీ నేర్పించాన‌ని, మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌కు మొజార్ట్, పోతోవ‌న్ బంటి లాంటి పేర్ల‌ను తానే ప‌రిచ‌యం చేసిన‌ట్టు ఇళ‌య‌రాజా చెప్పారు.

తానే సింపోనిని రూపొందించిన‌ట్టు చెప్పిన ఆయ‌న త‌న‌కు సంగీత‌మంటే ఎంత ఇష్ట‌మ‌నేది అంద‌రూ తెలుసుకోవాల‌ని, తాను ఇలా మాట్లాడ‌టం కొంద‌రికి క‌డుపు మంట అయిన‌ప్ప‌టికీ నా మ్యూజిక్ అంద‌రి జీవితాల్లో ఉంద‌ని తెలిపారు. త‌న సంగీతం విని ఓ బిడ్డ తిరిగి ప్రాణం పోసుకుంద‌ని, ఓ ఏనుగుల గుంపు త‌న సాంగ్స్ విన‌డానికి వ‌చ్చాయ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా అన్నారు.

ఇవ‌న్నీ చెప్పినందుకు త‌న‌కు గ‌ర్వం, పొగ‌రు అనుకుంటారు. త‌ను సాధించిన ఘ‌న‌త‌కు త‌న‌కు కాకుండా వేరే వారికి ఎందుకు గ‌ర్వ‌ముంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌పంచంలో ఎవ‌రూ చేయ‌లేని దాన్ని నేను చేశాను కాబ‌ట్టి నాకు ఆ పొగ‌రు ఉంటుంద‌ని, టాలెంట్ ఉన్నోళ్ల‌కే గ‌ర్వం ఉంటుంద‌ని ఇళ‌యరాజా పేర్కొన్నారు. ఇళ‌య‌రాజా మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు అంత‌టా వైర‌ల్ అవుతుంది.

Tags:    

Similar News