సీతమ్మని వీడని వివాదాలు

Update: 2015-07-05 08:54 GMT
అభినవ సీతమ్మగా అంజలికి పేరుంది. తెలుగింటి లోగిళ్లలో సీతగా పాపులర్‌ అయ్యింది. అంజలికి తెలుగు రాష్ట్రాలు, తంబీల్లో బోలెడంత పాపులారిటీ ఉంది. బొద్దుగా ఉన్నా ముద్దొచ్చే అందం ఈ భామకు పెద్ద అస్సెట్‌. అందుకే ఇప్పటికీ తెలుగు, తమిళ్‌లో అవకాశాలు వెంట వస్తున్నాయి. అయితే అప్పట్లో అంజలి రకరకాల వివాదాలతో వార్తల్లోకొచ్చింది. ఇది కెరీర్‌ని యూటర్న్‌ తిప్పేసింది. ఆ మలుపు కాస్తా రాంగ్‌ టర్న్‌ అయ్యింది.

అందుకే ఇప్పటికీ వివాదాలు వెంట వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి వివాదాల్లోకి వచ్చింది. అప్పట్లో మాపిళ్ల సంఘం అనే చిత్రానికి 54 కాల్షీట్లు ఇచ్చింది. అందులో సగం కాల్షీట్లను నిర్మాతలే వృధా చేసుకున్నారు. అయితే ఇప్పుడు అంజలిని ఆ కాల్షీట్లు కేటాయించాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. అరతేకాదు అంజలి సహకరించలేదంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటికే వేరే కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోతున్నానని అంజలి చెబుతోంది. ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని అందరికీ చెబుతోంది. మన సీతమ్మ ఇమేజ్‌ని తంబీలు డ్యామేజ్‌ చేయకుండా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, మీడియా సహకరిస్తే అంజలి ఇప్పటికైనా వివాదాల నుంచి బైటపడుతుంది. ఇది తెలుగువాడిగా మన బాధ్యత.

Tags:    

Similar News