టాలీవుడ్ నటసింహం నందమూరి బాలయ్య.. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితిలో ఎన్నో విధాలుగా జనాలకు అభిమానులకు తన వంతు సహాయం అందిస్తూనే ఉన్నారు. అయితే సినిమాల గురించి పక్కనపెడితె.. మాములుగా బాలయ్య సోషల్ ఇష్యూస్ పై త్వరగా రెస్పాండ్ అవుతారు. ఆ విధంగానే ఆయన ఫ్యాన్స్ కూడా బాలయ్య మాదిరిగానే సామాన్య ప్రజలకు సామాజిక కార్యక్రమాలతో హెల్ప్ చేస్తుంటారు. అయితే వచ్చే నెల అంటే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు ఉంది. ఆ సందర్బంగా బాలయ్య ఫ్యాన్స్ పుట్టినరోజు వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేయాలనీ ప్రయత్నం చేస్తున్నారు.
అయితే తాజాగా బాలయ్య ఫ్యాన్ ఒకరు ఆయనతో మాట్లాడిన ఫోన్ కాల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కాల్ రికార్డులో బాలయ్య తన అభిమానితో సెలెబ్రేషన్స్ వద్దని చెప్పి ఏదైనా ఖర్చు చేయాలనీ అనుకుంటే పేదలకు ఖర్చు చేయండని చెప్పడం విశేషం. ఆ కాల్ లో బాలయ్య మాటలు బట్టే ఆయన ఎంత కేర్ తీసుకుంటారు అనేది అర్ధమవుతుంది. అయితే ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే బాగోగులు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చాలా పుట్టినరోజు సెలెబ్రేషన్స్ గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సెలెబ్రేషన్స్ చేయకుండా పేదలకు సహాయం చేయండి.

అలా చేసినట్లయితే నాకు మీరిచ్చిన బర్త్ డే గిఫ్ట్ గా ఫీలవుతాను. అందరూ బాగుండాలి. సర్వేజనా సుఖినోభవంతు అంటూ పలు మంచి విషయాలు తన అభిమానికి చెప్పి వీలైతే పేదలకు హెల్ప్ చేసి అవసరం అయినవారికి మన బసవతారక హాస్పిటల్ లో వైద్యం చేయిద్దామని ధైర్యం చెప్పడం మనం వినవచ్చు. ప్రస్తుతం ఆ ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా వీరి కాంబినేషన్ లో మూడోది. ఈ నెలలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.