వర్మ నీతులకు ఫ్యాన్స్ రియాక్షన్ అదే

Update: 2016-09-21 06:10 GMT
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలతో సంచలనాలు సృష్టించి చాలా కాలమే అయింది. ట్విట్టర్ లోనే వర్మ హంగామా అంతా కనిపిస్తూ ఉంది. రోజూ ఉదయాన్నే సూర్యుడు ఉదయించడం.. సాయంత్రం అస్తమించడం ఎంత పక్కాగా జరుగుతాయో.. ఏదో ఓ టాపిక్ పై వర్మ ట్వీట్స్ పెట్టడం కూడా అంతే కామన్ అయిపోయింది. అయితే.. ఈసారి వర్మ పెట్టిన ట్వీట్ లనే రిటర్న్ పంచ్ లుగా వేస్తున్నారు  ఫాలోయర్స్.

'ఓ మహిళ నో అని చెప్పిందంటే.. దాన్ని నో అని అర్ధం చేసుకోవాల్సిందే. ఆ నో ను ఎవరైనా అర్ధం చేసుకోకపోతే.. వాళ్లను బ్లాక్ అండ్ పింక్ వరకూ చితగ్గొట్టాల్సిందే' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. జనరల్ గా నెగిటివ్ యాంగిల్ లో ఉండే ఈ డైరెక్టర్ ట్వీట్స్.. లేకలేక పాజిటివ్ టర్న్ తీసుకుంటే.. ఫ్యాన్స్ మాత్రం రిటార్ట్ ఇచ్చేశారు. 'మీ సినిమాలపై మీరు వ్యూయర్ల కామెంట్స్ అర్ధం చేసుకున్నట్లుగా' అంటూ ఓ అభిమాని పంచ్ వేస్తే.. మరో ఫాలోయర్ రీట్వీట్ అయితే సూపర్ గా పేలింది.

'భయపెట్టే సినిమాలు సిరీస్ లకు ఆడియన్స్ నో చెబుతున్నా సరే.. వాటిని అర్ధం చేసుకోని డైరెక్టర్లకు కూడా.. డిటో ఇలాంటి శిక్షే పడాలి' అన్నాడు ఇంకో ఫ్యాన్. వీళ్ల పంచ్ లు వర్మకు నేరుగానే తగిలాయి లెండి.

Tags:    

Similar News