ప్లాప్ డైరెక్టర్ కు అసిస్టెంట్స్ కావాలట.. ట్రాన్స్ జెండర్ ఐనా పర్వాలేదట
నటుడిగా పలు సినిమాల్లో నటించిన రాహుల్ రవీంద్రన్ అంతగా ఆకట్టుకోలేక పోయాడు. హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన రాహుల్ రవీంద్రన్ సక్సెస్ దక్కక పోవడంతో దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. దర్శకుడిగా మొదటి సినిమా చి.ల.సౌ తో ఆకట్టుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్ రెండవ సినిమానే స్టార్ హీరో నాగార్జునతో చేసే అవకాశం దక్కించుకున్నాడు. నాగ్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ అయిన మన్మధుడు సినిమా టైటిల్ ను తీసుకుని మన్మధుడు 2 అంటూ తెరకెక్కించాడు. మన్మధుడు కు ఏమాత్రం సంబంధం లేకుండా మన్మధుడు 2 ఉంటుంది. ఒకే టైటిల్ అవ్వడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. కాని నాగ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మన్మధుడు 2 నిలిచింది.
ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర పడ్డ రాహుల్ రవీంద్రన్ తన మూడవ సినిమా కోసం స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో ఆయన కనిపిస్తున్నాడు. మొదటి సినిమా తరహాలో ఒక సింపుల్ కథను తీసుకున్న రాహుల్ రవీంద్రన్ త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఆ నిర్మాణ సంస్థ ఏది.. ఎప్పుడు ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది అంటూ త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో తనకు అసిస్టెంట్స్ కావాలంటూ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించి ఔత్సాహికులకు మంచి అవకాశంను ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.
రాహుల్ తన తదుపరి సినిమాకు పూర్తిగా లేడీస్ అసిస్టెంట్స్ ను గా తీసుకోవాలనుకుంటున్నాడట. అందుకు కారణం స్క్రిప్ట్ మహిళ నేపథ్యం అయ్యి ఉంటుందని అంటున్నారు. అమ్మాయిలు సినిమాలపై ఆసక్తి ఉండి.. హార్డ్ వర్క్ చేసే ఉద్దేశ్యం ఉండి.. దర్శకత్వం పై ఇంట్రెస్ట్ ఉన్న వారి వివరాలను పంపించండి అంటూ మెయిల్ ఐడీ కూడా ఇచ్చాడు. అమ్మాయిలు మహిళలకు మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్ లకు కూడా ఈ అవకాశం అంటూ ప్రకటించాడు. ట్రాన్స్ జెండర్ లను కూడా అసిస్టెంట్ గా తీసుకునేందుకు సిద్దం అన్నట్లుగా రాహుల్ ప్రకటించడం జరిగింది. మన్మధుడు 2 తో ప్లాప్ అయినా కూడా రాహుల్ తదుపరి సినిమా తో ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడనే నమ్మకం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా ఈయనతో సినిమాకు వర్క్ చేసేందుకు చాలా మంది ఆడవారు క్యూ కట్టే అవకాశం ఉంది.