గీతాఆర్ట్స్ బ్యానర్ లో ప్లాప్ డైరెక్టర్ కొత్త సినిమా..!

Update: 2021-06-12 09:30 GMT
తెలుగు చిత్రపరిశ్రమలో అటు నటుడిగా.. ఇటు దర్శకుడిగా టాలెంట్ ప్రూవ్ చేసుకొని నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ రవీంద్రన్. 2019లో టాలీవుడ్ కింగ్ నాగార్జునతో 'మన్మథుడు - 2' సినిమా తెరకెక్కించి ఊహించని ప్లాప్ ఖాతాలో వేసుకున్నాడు. గతంలో సూపర్ హిట్ అయినటువంటి మన్మధుడు సినిమా పేరు పెట్టేసరికి సీక్వెల్ మరో రేంజిలో ఉంటుందేమో అనుకున్నారు. కానీ మన్మధుడు సినిమా ఫ్లేవర్ కాకుండా పేరును డామేజ్ చేశారు. ఆ సినిమా నష్టాలతో పాటు ఎన్నో విమర్శలను తెచ్చిపెట్టింది. అయితే అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు నటుడుగా పరిచయమయ్యాడు రాహుల్.

డెబ్యూ మూవీలో అమాయకంగా కనిపించాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి అక్కినేని హీరో సుశాంత్ తో 'చిలసౌ' సినిమాను రూపొందించాడు. ఆ సినిమా డీసెంట్ హిట్ అందుకొని.. మంచి పేరుతో పాటు జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చింది. అలాంటి డైరెక్టర్ కింగ్ నాగ్ లాంటి హీరోతో ఫ్రెంచ్ మూవీ రీమేక్ చేసేసరికి అందరూ ఓ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఎక్సపెక్ట్ చేశారు. కానీ రాహుల్ అంచనాలకు భిన్నంగా తెరకెక్కించిన ప్లాప్ ముట్టజెప్పాడు. ఇక మన్మధుడు దెబ్బ తర్వాత ఇంతవరకు అటు యాక్టర్ గా దర్శకుడుగా ఒక్క సినిమా కూడా చేయలేదు రాహుల్. అయితే రెండేళ్లు గడిచాక ఇప్పుడు మరో సినిమా లైన్ చేసినట్లు తెలుస్తుంది.

అదికూడా టాలీవుడ్ బడా బ్యానర్స్ లో ఒకటైన గీతాఆర్ట్స్ బ్యానర్ లో రాహుల్ తదుపరి సినిమా లైన్ చేసాడు. కాకపోతే ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా లవ్ స్టోరీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ లాక్డౌన్ సమయంలో రాహుల్ చాలా స్క్రిప్టులు రెడీ చేసుకున్నాడట. అయితే ఇటీవలే గీతాఆర్ట్స్ ప్రొడ్యూసర్ లను కలిసి ఓ లవ్ స్టోరీ వినిపించడం జరిగిందట. రాహుల్ చెప్పిన లవ్ స్టోరీ నచ్చడంతో ప్రొడ్యూసర్స్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. నిజానికి రాహుల్ ఆ మధ్యలో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసాడని అలాగే సమంతతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ అనుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అవన్నీ పక్కనపెట్టి ప్రస్తుతం లవ్ స్టోరీ పైనే దృష్టిపెట్టినట్లు టాక్. చూడాలి మరి ఈసారి హిట్ కొడతాడేమో!
Tags:    

Similar News