మిత్రమా.. సింగిల్ కట్ లేకుండా వస్తున్నా..

Update: 2017-01-05 14:21 GMT
సంక్రాంతికి వస్తున్న బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి మరో ఘనతను సాధించింది. ఒక్కటంటే.. ఒక్క కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

బాలకృష్ణ సరసన శ్రేయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వీరమాత గౌతమిగా బాలీవుడ్ ప్రముఖ నటీమణి.. ఎంపీ హేమమాలిని నటించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు ఒక్కకట్ కూడా చెప్పకుండా యూ/ఈ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సినిమాను చూసిన అనంతరం సెన్సార్ సభ్యులు చిత్ర బృందానికి అభినందనలు తెలిపినట్లుగా చెబుతున్నారు. భారీ ఎత్తున తెర కెక్కించిన యుద్ధసన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.

శాలివాహన శకం నేపథ్యంలో తీసిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ ఒక దృశ్యకావ్యంగా తీసినట్లుగా చెబుతున్నారు. సెన్సార్ సభ్యుల ఫీడ్ బ్యాక్ ప్రకారం.. ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి తెలుగువాడి దృష్టిని ఆకర్షించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఆ మాటల్లో నిజం ఎంతన్నది తేలటానికి మరో వారం మాత్రమే మిగిలి ఉందని చెప్పాలి. ఈ నెల 12న భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News