బాబాయ్ కోసం క్రేజీ యంగ్ హీరో మళ్లీ వెనక్కి తగ్గారు. వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన క్రేజీ చిత్రం `భీమ్లా నాయక్`. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె. చంద్ర రూపొందించారు. ఇందులో పవన్ కు పోటాపోటీగా రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించారు. మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం.. పవన్ క్రేజ్ కి తగ్గట్టుగా కథలో మార్పులు చేయడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
`వకీల్ సాబ్` చిత్రం తరువాత పవన్ నటించిన సినిమా కావడం.. అంటే కాకుండా `గబ్బర్ సింగ్` తరువాత అంతకు మించి అనే స్థాయిలో డిజైన్ చేసిన భీమ్లా నాయక్ పాత్రలో పవన్ నటించడం.. టీజర్ లో రానాపై వన్ చిందులు వేసిన తీరు సినిమాపై అంచనాల్ని స్కై హైకి చేర్చింది.
గత కొన్ని రోజులుగా ఈ మూవీ రిలీజ్ పై నెలకొన్న కన్ఫ్యూజన్ కు తాజాగా ఎండ్ కార్డ్ పడింది. ఈ చిత్రాన్ని ఎట్టకేలకు ఈ నెల 25న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించడంతో `భీమ్లా నాయక్` ఆగమనం పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
అయితే ఈ విషయాన్ని గ్రహించని `గని` మేకర్స్`భీమ్లా నాయక్` ఇప్పట్లో రాదని పొకపాటు పడి ఫిబ్రవరి 25న వచ్చేస్తున్నామంటూ ప్రకటించేశారు. `భీమ్లా రిలీజ్ డేట్ హఠాత్తుగా ప్రకటించడంతో `గని` మేకర్స్ కి ఊహించని షాక్ తగిలింది.
ఇప్పుడు రిలీజ్ డేట్ ని మార్చాలా? లేక అదే డేట్ కి ముందుకెళ్లాలా? అని ఇన్ని రోజులు ఆలోచించిన మేకర్స్ ఫైనల్ గా `గని` రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టుగా మంగళవారం ప్రకటించారు. `గని`పై మీరు చూపిస్తున్న ప్రేమకు ఉప్పొంగిపోతున్నాం.
మీ ప్రోత్సాహం.. మోటివేషన్ .. ఈ టఫ్ టైమ్ లో మేము ముందడుగు వేయడానికి ప్రోత్సాహన్నిస్తున్నాయి. `భీమ్లా నాయక్` ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో మా చిత్ర రిలీజ్ ని వాయిదా వేస్తున్నాం. మరో రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తాం. అభిమానులతో పాటే పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ని థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం` అని ప్రకటించారు.
`గని` చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపనీ రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు.
కన్నడ స్టార్ ఉపేంద్ర - బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి - నవీన్ చంద్ర - నదియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నాప్రత్యేక గీతంలో నటిస్తున్నారు. `గని` రిలీజ్ మరోసారి వాయిదా పడటంతో బాబాయ్ కోసం అబ్బాయి మళ్లీ వెనక్కి తగ్గాడని అంటున్నారు.