ప్రస్తుతం సినిమాల మార్కెట్ విస్తృతం అయిందనడంలో సందేహం లేదు. దేశంలో థియేట్రికల్ కలెక్షన్స్ కి ఓవర్సీస్ రైట్స్ తోడయ్యి చాలా కాలం అయింది. ఆడియో రైట్స్.. శాటిలైట్ హక్కులతో కూడా బాగానే గిడుతోంది. వీటితో పాటు ఇప్పుడు కొత్తగా డిజిటల్ రైట్స్ కూడా యాడ్ అయ్యాయి.
రేపు రిలీజ్ కానున్న మూవీ ఘాజీకి డిజిటల్ రైట్స్ రూపంలో దక్కిన మొత్తం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగు.. హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం.. తమిళ్ లో డబ్ అవుతోంది. మూడు భాషల డిజిటల్ రైట్స్ కలిపి ఏకంగా 12.5 కోట్ల రూపాయలకు విక్రయించారట. ఈ విషయంపై అటు నిర్మాతలు కానీ.. ఇటు మూవీ యూనిట్ కానీ ఎవరూ స్పందించలేదు కానీ.. ఈ రేటు మాత్రం కరెక్టే అనే టాక్ ఉంది.
కొత్త దర్శకుడు రూపొందించిన ఓ చిత్రానికి.. ఇంత భారీ మొత్తం కేవలం డిజిటల్ హక్కుల రూపంలో దక్కడం అంటే.. కచ్చితంగా ఘాజీ కొత్త రికార్డు నెలకొల్పినట్లే. రిలీజ్ కి ముందే ఇంత పెద్ద రికార్డు నమోదు చేసిన ఘాజీ.. రిలీజ్ తర్వాత మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/