రానా కోసం సెట్ మొత్తం మార్చారట

Update: 2017-02-06 11:08 GMT
లఘు చిత్రంగా చేద్దామనుకున్న సినిమా.. వంద కోట్లకు పైగా బడ్జెట్లో మూడు భాషల్లో భారీగా తెరకెక్కడం విశేషమే. ‘ఘాజీ’ సినిమా విషయంలో ఇలాగే జరిగింది. 1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ‘ఘాజీ’ అనే పుస్తకం రాసిన సంకల్ప్ రెడ్డి అనే తెలుగు యువకుడు.. దీని మీద షార్ట్ ఫిల్మ్ తీయాలన్న ఆలోచనతో హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర సెట్ రూపొందిస్తుంటే.. దాన్ని ‘ఉయ్యాల జంపాల’ నిర్మాత రామ్మోహన్ చూసి.. రానాకు చెప్పడం.. ఆపై పీవీపీ ఈ ‘ఘాజీ’ కథ వినడం.. లఘు చిత్రం అనుకున్నది కాస్తా.. ఫీచర్ ఫిలింగా మారడం జరిగాయి.

ఐతే లఘు చిత్రం కోసమని ఎంతో కష్టపడి వేసిన సెట్ ను సంకల్ప్ బృందం సినిమా కోసం ఉపయోగించుకోలేకపోయిందట. ఇందుకు కారణం రానానే. భారీ కాయుడైన రానాకు తగ్గట్లుగా ఈ సెట్ లేదట. అతడి హైట్ కి ఈ సెట్ సూటవ్వలేదట. దీంతో మొత్తం సెట్ అంతా మార్చాల్సి వచ్చిందట. పీవీపీ ఏమాత్రం రాజీ పడకపోవడంతో రానాను దృష్టిలో ఉంచుకుని కొత్తగా మరో మూడు కంపార్ట్ మెంట్లతో ఘాజీ కోసం సబ్ మెరైన్ సెట్టింగ్ వేసినట్లు ఈ చిత్రం ప్రొడక్షన్ డిజైనర్ శివం రావు తెలిపాడు. హైదరాబాద్ లోని స్క్రాప్ మార్కెట్లలో ఆరు నెలల పాటు తిరిగి.. అనేక రకాలైన సామగ్రిని సేకరించడంతో పాటు అనేక మంది నేవీ అధికారుల్ని కూడా కలిసి ఈ సెట్ రూపొందించినట్లు శివం రావు తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News