ఇండియాలో సల్మాన్ ఖాన్ అంటే ఎవ్వరైనా సరే గ్రేట్ సినిమా యాక్టర్ అని చెప్పేస్తారు. మినిమమ్ 200 కోట్ల మార్కెట్ ఉన్న అతి తక్కువ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. సల్మాన్ సినిమా గట్టిగా ఆడింది అంటే 500 కోట్లు కూడా దాటేస్తుండడం తెలిసిందే. ఇంటర్నెట్ లోనే ఈ విషయాలు బాగా తెలుస్తాయి. కానీ అన్ని తెలిసిన గూగుల్ మాత్రం సల్మాన్ ఖాన్ ను లెక్క చేయకపోవడం గమనార్హం.
ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ రాజుగా ఉన్న గూగుల్ లో బాలీవుడ్ వరస్ట్ యాక్టర్ అని సెర్చ్ చేయగా సల్మాన్ పేరు అతని ఫోటో దర్శనమిచ్చింది. విషయం తెలియగానే సోషల్ మిడియలో ఒక్కసారిగా ఆ న్యూస్ వైరల్ అయ్యింది. సల్మాన్ గురించి గూగుల్ ఏమనుకుంటోంది అంటూ.. కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి పొరపాట్లు గూగుల్ లో జరగడం కొత్తేమి కాదు. గతంలో భారతదేశ మొదటి ప్రధాన మంత్రి ఎవరని సెర్చ్ చేస్తే జవాహర్ లాల్ నెహ్రూ ఫోటో చూపించింది. పక్కన మాత్రం నరేంద్రమోదీ ఇమేజ్ కనిపించడంతో ఆ న్యూస్ కూడా వైరల్ అయ్యింది.
ఇక ఇప్పుడు విదేశాల్లో కూడా ఫాలోయింగ్ ఉన్న సల్మాన్ ఖాన్ విషయంలో కూడా గూగుల్ పెద్ద పొరపాటే చేసింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మిడియలో ట్రెండ్ అవుతున్నాయి. చివరికి గూగుల్ స్పందించి తప్పును సరిదిద్దుకుంది. నిజంగా గూగుల్ లోనే ఇలాంటి దారుణమైన మిస్టేక్స్ కనిపిస్తే.. నిజమేదో తెలుసుకోవడం కష్టమే సుమీ..