అవినీతి రాజకీయాలు సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. వాళ్ల ఆశలను .. ఆశయాలను చిదిమేస్తున్నాయి. అలాంటి అవినీతి రాజకీయాలను ధైర్యంగా ప్రశ్నించి, అలాంటి రాజకీయ నాయకులను నిలదీసిన ఒక నిజాయితీ పరుడిసైన కలెక్టర్ కథే 'రిపబ్లిక్'. అక్టోబర్ 1వ తేదీన సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి నిర్వహించారు. ఈ వేదికపై క్రిష్ మాట్లాడాడు.
"ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. నిజంగా ఇది ఎంతగానో ఆనదించవలసిన విషయం. ఇది ఒక్క సాయితేజ్ కి మాత్రమే కాదు .. ఇండస్ట్రీకి కూడా చాలా ఇంపార్టెంట్ మూవీ. దేవ కట్టా సినిమాల్లో తనదైన మార్కు తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన సినిమాల్లో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమా గొప్ప హిట్ ను అందుకుని అందరి కెరియర్ కి హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.
ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ .. "నాకు ఇండస్ట్రీలోని అత్యంత సన్నిహితుల్లో సాయితేజ్ ఒకరు. నన్ను అన్నయ్యా .. అన్నయ్యా అని పిలుస్తూ ఉంటాడు. మా ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంది. ఇండస్ట్రీలో వెరీగుడ్ హ్యూమన్ బీయింగ్ ఉన్న వ్యక్తి ఎవరంటే .. తేజ్ అని చెబుతాను. నాకు ఆయన అత్యంత ఆప్తుడు .. శ్రేయోభిలాషి. ఒక్కమాటలో చెప్పాలంటే అజాతశత్రువు. సాయితేజ్ ను నేను చాలా దగ్గరగా గమనించాను. చిరంజీవి .. పవన్ కల్యాణ్ గారు మిక్స్ అయితే తేజ్. వాళ్లిద్దరి నుంచి స్టైల్ ను .. డాన్స్ ను పుణికిపుచ్చుకున్నాడు" అని చెప్పుకొచ్చాడు.
ఇక దిల్ రాజు మాట్లాడుతూ .. "ఇక్కడ ఈ అభిమానుల సందడి చూస్తే తేజు త్వరగా కోలుకుంటాడు. దేవ కట్టా గొప్ప దర్శకుడు. తాను అనుకున్న అవుట్ పుట్ అవచ్చేవరకూ ఆయన వదిలిపెట్టడు. తేజు నాకు ఒకసారి ఈ సినిమా లైన్ చెప్పాడు .. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. తేజు ఎన్నో సక్సెస్ లు చూశాడు .. ఫెయిల్యూర్స్ చూశాడు. తేజుకు అండగా ఉంటూ, మెగాస్టార్ .. పవర్ స్టార్ ఇద్దరూ కూడా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాను అంతా ఆదరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.