లేడీ పైలట్ తో ముచ్చటించిన జాన్వీ..అందుకేనా?

Update: 2020-07-25 02:30 GMT
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుసు కదా.. తనేనండీ అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు. 2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మించాడు. మరాఠిలో సూపర్ హిట్ ‘సైరాత్‌’ సినిమా నుండి దఢక్ సినిమా రీమేక్‌ చేశారు. ఇక ఫస్ట్ సినిమా డీసెంట్ హిట్ అవ్వడంతో జాన్వీ మంచి పాపులారిటీ దక్కించుకుంది. అప్పటి వరకు ఎప్పుడు చూసినా నాన్న కూచి, అమ్మ కొంగుచాటు బిడ్డలా కనిపించిన జాన్వీ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. అదెలాగో అని ఆశ్చర్యపోకండి.. తన అందాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకొని.. అమాంతంగా అభిమానులను సంపాదించుకుంది. చేసింది ఒక్క సినిమా అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మాములుగా లేదు.

జాన్వీ శ్రీదేవి కూతురు అన్నట్లే గాని తనకు తానుగా నిలదొక్కుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తుంది. ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. సోషల్ మీడియాలో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. జాన్వి ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ లేడీ పైలట్ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌లో నటిస్తుంది. ఈ పాత్రలో నటించడానికి జాన్వీ గుంజన్ సక్సేనాతో ముచ్చటించి చాలా విషయాలు తెలుసుకుందట. జాన్వీ మాట్లాడుతూ.. ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ వైమానిక దళ పైలట్‌ బయోపిక్ సినిమా కోసం నేను సక్సేనాతో చాలాసేపు మాట్లాడాను. కష్టపడి పని చేస్తే ఏదైనా సాధించవచ్చని తెలిసింది. ఇప్పటికి గుంజన్‌ చాలా సింపుల్‌గా ఉన్నారు. కష్టపడి పనిచేస్తే ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుందని చెప్పుకొచ్చింది జాన్వీ. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అవుతుంది అమ్మడు. ప్రస్తుతం జాన్వీ చేతిలో ‘కార్గిల్‌ గాళ్‌’.. ‘రుహీ అఫ్జా’.. ‘తక్త్‌’ సినిమాలు ఉన్నాయట.
Tags:    

Similar News