రజినీ సినిమా మొదలవ్వకముందే వివాదం
పెద్ద హీరోల సినిమాల వెంటే వివాదాలు నడిచొస్తుంటాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకైతే ఈ బెడద మరీ ఎక్కువ. లింగా.. కబాలి సినిమాల విషయంలోనూ ఆయన అనవసర వివాదాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రజినీ కొత్త సినిమా ఇంకా మొదలవ్వకముందే వివాదాల్లో చిక్కుకోవడం విశేషం. ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్.. రజినీతో మరో సినిమాకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. అండర్ వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని.. రజినీ హాజీ మస్తాన్ పాత్రనే చేయబోతున్నాడని కొంత కాలంగా ఈ సినిమా గురించి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రచారాన్ని రంజిత్ ఖండించినప్పటికీ.. హాజీ మస్తాన్ దత్త పుత్రుడు తేలిగ్గా తీసుకోవట్లేదు. రజినీ అండ్ టీంకు అతను లీగల్ నోటీసు పంపించాడు. సినిమా పేరుతో తన తండ్రి నాన్న జీవిత చరిత్రతో ఆడుకుంటే ఊరుకునేది లేదంటూ రజనీకాంత్ కు హాజీ మస్తాన్ దత్తపుత్రుడు హెచ్చరిక జారీ చేశాడు. మరి చిత్ర బృందం ఈ నోటీసులకు ఎలా స్పందిస్తుందో చూడాలి. మామూలుగా రజినీ వివాదాలంటే భయపడతాడు. జాగ్రత్తలు పాటిస్తాడు. మరి నిజంగానే హాజీ మస్తాన్ స్ఫూర్తితో కథను అల్లుకుని ఉంటే మార్పులేమైనా చేస్తారేమో చూడాలి. రజినీ అల్లు ధనుష్ నిర్మించనున్న ఈ సినిమాలో విద్యా బాలన్ రజినీకి జోడీగా నటించనుంది. ‘కబాలి’ తరహాలోనే వేగంగా ఈ సినిమాను పూర్తి చేయడానికి రంజిత్ ప్లాన్ రెడీ చేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/