ఈ ఏడాది హన్సిక లక్ష్యం అదేనట

Update: 2019-01-04 01:30 GMT
తెలుగులో ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్‌ గా పరిచయం అయ్యి, ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా పుష్కర కాలంకు పైగా వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్న ముద్దుగుమ్మ హన్సిక. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఈమె వరుసగా చిత్రాలు చేస్తూ వస్తుంది. తమిళంలో ఈమె స్టార్‌ హీరోలకు జోడీగా నటించి అక్కడ స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో స్టార్‌ డం దక్కలేదు. అందుకే ఈమె తమిళంకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది.

ఈ అందమైన అమ్మాయికి అందమైన మనసు కూడా ఉంది. ఆ అందమైన మనసుతో పెళ్లి కాకుండానే, చిన్న వయస్సులోనే ఏకంగా 34 మంది పిల్లలకు తల్లి అయ్యింది. ప్రస్తుతం ముంబయికి చెందిన ఆ 34 మంది పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను హన్సిక చూసుకుంటుంది. వారికి అవసరం అయ్యే ప్రతి విషయాన్ని హన్సిక అందుబాటులో ఉంచుతుంది. వారికి నాణ్యమైన ఆహారం మరియు చదువు, చికిత్సను హన్సిక వారికి అందిస్తూ వస్తుంది. ఇక ఈ ఏడాదిలో ఆ 34 మంది పిల్లల్లో ఒకరు 10వ తరగతి పరీక్ష రాయబోతున్నారట.

ఈ సందర్బంగా హన్సిక న్యూ ఇయర్‌ లో తన పిల్లల్లో ఒకరు 10వ తరగతి పరీక్ష రాయబోతున్నాడు. ఆ పిల్లాడు స్టేట్‌ లోనే టాప్‌ వచ్చేలా అతడికి శిక్షణ ఇప్పించడంతో పాటు, అతడు ఉన్నతంగా మార్కులు సాధించేందుకు తనవంతు కృషి చేస్తాను. అతడిని టాప్‌ స్టూడెంట్‌ గా నిలపడమే ఈ సంవత్సరం తన ముందు ఉన్న ముఖ్య లక్ష్యం అంటూ చెప్పుకొచ్చింది. ఎంతో మంది హీరోయిన్స్‌ లక్షలు, కోట్లు సంపాదిస్తారు. కాని హన్సికల బాధ్యతయుతంగా వ్యవహరించే వారు మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి.

ప్రస్తుతం హన్సిక ‘మహా’ అనే వివాదాస్పద చిత్రంలో నటిస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్‌ కూడా వివాదాస్పదం అవుతూ వస్తోంది. సినిమా ఇంకెంత వివాదంను రేపుతుందో చూడాలి.




Full View
Tags:    

Similar News