కులాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు బాలీవుడ్ నటి యువికా చౌదరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దళిత హక్కుల కార్యకర్తల ఫిర్యాదు మేరకు.. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇటీవల యువికా ఓ వీడియోలో షెడ్యూల్డ్ కులాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందని, ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల కార్యకర్త రజత్ కల్సన్ పోలీసులను కోరారు. ఈ మేరకు ఈ నెల 26న ఫిర్యాదు చేశారు. దీంతో.. సైబర్ సెల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీంతో.. ఆమె వ్యాఖ్యలు నిజమేనని తేలడంతో ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది.
కాగా.. ఈ విషయం దుమారం రేపడంతో యువికా నష్టనివారణ చర్యలు చేపట్టింది. తాను ఒక వర్గం వారిని కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలను పొరపాటున ఉపయోగించానని, తనను క్షమించాలని సోషల్ మీడియా ద్వారా కోరింది. మరి, కేసు నమోదైంది కాబట్టి.. ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి.