ఫస్ట్ గ్యాంగ్ లీడర్ నాని కాదట

Update: 2019-02-25 05:27 GMT
నిన్న సాయంత్రం నాని కొత్త సినిమా టైటిల్ గ్యాంగ్ లీడర్ అని ప్రకటించినప్పటికీ నుంచి న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన రాగా తమ మెగాస్టార్ టైటిల్ వాడుకుంటారా అంటూ మెగాభిమానుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది . అయితే అందరికి వస్తున్న కామన్ సందేహం ఒకటుంది. దర్శకుడు విక్రం కుమార్ ఇంతకు ముందు కాన్సిల్ అయిన అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కు చెప్పిన కథ ఇది ఒకటేనా కాదా అని. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రెండూ ఒకటేనట.

తన ఇమేజ్ కు ఇలాంటివి అంతగా నప్పవని ఆల్రెడీ నా పేరు సూర్యతో రిస్క్ చేశాను కాబట్టి ఇది తాను చేయలేని బన్నీ చెప్పాడని టాక్. ఒకవేళ ఇది ఇంకెవరితో తీసినా గ్యాంగ్ లీడర్ టైటిల్ చాలా బాగుంటుందని సూచించింది కూడా తనేనని మరో న్యూస్. దానికి విక్రం కుమార్ కూడా కనెక్ట్ కావడంతో అప్పటి నుంచి అదే పేరు మీదే ఫైనల్ స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటూ వచ్చాడని తాజా అప్ డేట్

అమ్మాయిలు మహిళలు కలిసి మొత్తం ఐదుగురి జీవితాలతో ముడిపడిన కథకు గ్యాంగ్ లీడర్ అనే మాస్ టైటిల్ ఎంతవరకు కరెక్ట్ అనే విశ్లేషణలు ఇప్పటికే మొదలైపోయాయి. వాళ్ళ వెనుక నాని పాత్ర ఉన్నప్పటికీ సాధారణంగా గ్యాంగ్ అనే పదానికి మాస్ లో ఉన్న అర్థం వేరు. మరి నాని లాంటి ఫ్యామిలీ ప్లస్ యూత్ హీరోకు ఇది సూట్ అవుతుందాని మెజారిటీ జనం అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ అల్లు అర్జున్ ఈ కథను ఓకే చేసి గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకుని ఉంటే ఇంత చర్చ వచ్చేది కాదేమో. సరైనోడు నుంచి ఎలాగూ బన్నీకి మాస్ లో మంచి ఇమేజ్ వచ్చింది సో నప్పేలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడిది నానికి వచ్చి చేరింది కాబట్టి గ్యాంగ్ లీడర్ ట్యాగ్ కి న్యాయం చేయాలంటే కంటెంట్ చాలా బలంగా ఉండాలి
Tags:    

Similar News