ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఆదిపురుష్- సలార్- ప్రాజెక్ట్ కే లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవన్నీ 2023లో ఒకదాని వెంట ఒకటిగా విడుదల కానున్నాయి. ఓవైపు ప్రాజెక్ట్ కే చిత్రీకరణకు సహకరిస్తూనే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటిస్తుండడం ఆసక్తిని కలిగించింది.
ఇది అరుదైన కలయిక. ఈ మూవీకి టైటిల్ ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఇటీవల ప్రభాస్ పై ఫోటోషూట్ పూర్తయింది. మొదటి షెడ్యూల్ షూట్ ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. దీని కోసం మేకర్స్ ఒక ప్రత్యేక సెట్ నిర్మించారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో అక్టోబర్ 20 నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రభాస్ చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ వారం పైగా సాగుతుంది. ఇందులో మాళవిక మోహానన్ - నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి కూడా పాన్ ఇండియా అప్పీల్ రప్పించేందుకు మారుతి తెలివైన ఎంపికలతో ముందుకు వెళుతున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీని కీలక పాత్రకు ఎంపిక చేసుకున్నారు. బోమన్ ఇరానీని ప్రభాస్ తాతగా చూస్తారని.... సీనియర్ నటుడి పాత్రకు ఇందులో చాలా ప్రాధాన్యత ఉందని తెలిసింది.
నిజానికి బొమన్ ఇరానీ పరిచయం అవసరం లేదు. ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలోనూ తాత పాత్రలో అదరగొట్టాడు. ఇప్పుడు ప్రభాస్ కి తాతగా మరో ఛాన్స్ దక్కింది. బొమన్ బహుభాషా నటుడు. ముఖ్యంగా హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించాడు.
తెలుగులో అత్తారింటికి దారేది సహా పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బొమన్ ఇరానీ బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్- పీకే సహా పలు చిత్రాల్లో అతడు నటించాడు. తదుపరి షారూక్ డుంకీలోనూ అతడు కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.