గత ఏడాది మాస్ రాజా రవితేజకు పీడకలలా మిగిలిపోయింది. ఒకటి కాదు ఏకంగా మూడు డిజాస్టర్లు పలకరించడమే కాదు మొత్తం కలిపినా పాతిక కోట్లు రాబట్టలేక మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. సరే ఇదంతా పరిశ్రమలో మాములే కాబట్టి డిస్కో రాజాతో రవితేజ ఇటీవలే మళ్ళి సెట్స్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఏ సినిమా ఉంటుంది అనే దాని గురించి ప్రస్తుతానికి ఖచ్చితమైన క్లారిటీ లేదు కాని తాజా సమాచారం మేరకు పక్కన పెట్టిన స్క్రిప్ట్ ని ట్రాక్ మీద తెచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది.
ఏడాది ముందే మైత్రి సంస్థ పవన్ కళ్యాణ్ తో తమిళ్ బ్లాక్ బస్టర్ తేరిని రీమేక్ చేయాలని కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో మార్పులు చేర్పులతో స్క్రిప్ట్ రెడీ చేయించింది. సరిగ్గా అదే టైంలో జనసేన అనౌన్స్ చేసి పవన్ రాజకీయాలవైపు వెళ్ళిపోయాడు. ఇది అప్పటికే మైత్రికి కమిట్ అయిన రవితేజ దగ్గరకు వెళ్ళింది. ఇలాంటి పోలీస్ కథలకు బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే మాస్ రాజా ముందు చేద్దామనే అనుకున్నాడు.
కాని అదే సమయంలో ఇలాంటి లైన్ మీదే సాగే టచ్ చేసి చూడు ఘోరమైన ఫలితాన్ని అందుకోవడంతో తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు దీన్నే మరింత చక్కగా మెరుగులు దిద్ది డిస్కో రాజాతో పాటు షూటింగ్ జరిగే విధంగా రవితేజ అంగీకారం తెలిపినట్టుగా టాక్. అమర్ అక్బర్ అంటోనీ నిర్మించి దెబ్బ తిన్న మైత్రి సంస్థ దీని ద్వారా రికవరీ చేసుకునే ప్లాన్ లో ఉంది. ఇది నిజమో కాదో మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకశం ఉంది