తమిళ నటుల సంఘం నడిగర్ కు ఈనెల 23వ తారీకున ఎన్నికలు జరుగబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న విశాల్ అండ్ టీం మరోసారి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు శరత్ కుమార్ వర్గం నుండి భాగ్యరాజ్ నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. గతంలో శరత్ కుమార్ ను ఓడించడం ద్వారా విశాల్ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు భాగ్యరాజ్ ను ఓడించి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వాలని విశాల్ భావిస్తున్నాడు.
నడిగర్ సంఘంలో గెలుపు కోసం విశాల్ గతంలో శతర్ కుమార్ అవినీతి అక్రమాలకు సంబంధించిన వీడియోలు అంటూ విడుదల చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆ వీడియోలు విడుదల చేసినందుకు గాను విశాల్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విశాల్ నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సంవత్సరాలఱు తాను చేసిన అభివృద్దిని చెప్పుకుంటూ ఎన్నికల్లో ఓట్లు అడగాల్సింది పోయి ఇంకా గతంలో పాత అధ్యక్షుడు చేసిన పనులను చెప్పి ఆయనపై విమర్శలు చేసి ఓట్లు అడిగేందుకు ప్రయత్నించడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే తన తండ్రిపై వీడియోను విడుదల చేసినందుకు గాను విశాల్ కు ఆప్త మిత్రురాలు అయిన వరలక్ష్మి ఆయనకు దూరం అయ్యింది. నీవు చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగి ఉంటే నేను నీకు ఓటు వేసేదాన్ని.. కాని నువ్వు నీచమైన రాజకీయాలకు పాల్పడ్డావు అంటు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తాజాగా శరత్ కుమార్ భార్య రాధిక కూడా ఈ విషయమై స్పందించింది.
ఈ రెండు సంవత్సరాల్లో అతడు చేసిన పనులు ఏమీ లేవు. అతడు చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడం వల్లే మళ్లీ ఆ వీడియోలను విడుదల చేశాడు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న విషయాలను ఇలా రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం అతడికే చెల్లిందని అన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ఆయన చేసిన పనులు శూన్యం. అందుకే కోర్టు పరిధిలో ఉన్న విషయాలను ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడుకుంటున్నారంటూ రాధిక ఆరోపించింది. ఇంకా పలువురు కూడా విశాల్ తీరుపై విమర్శలు చేస్తున్నాడు. విశాల్ ఈ రెండేళ్లలో ఏం చేశాడో చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.