అప్పుడు చేతులు ఇరగ్గొట్టుకున్నాడు! ఇప్పుడు కాళ్లు ఇరగ్గొట్టుకున్నాడు!!
ఎన్ని సార్లు ఏది విరిగినా విశాల్ చాలా మొండోడు! అప్పుడు చేతులు ఇరగ్గొట్టుకున్నాడు! ఇప్పుడు కాళ్లు ఇరగ్గొట్టుకున్నాడు!! అంతకుముందు ఏకంగా వెన్ను పాము బెణికింది. ఇన్ని జరిగినా కానీ అతడు మాత్రం కూల్ గా తమిళ పద్యాలు పాడుతూ.. ఏదీ లెక్క చేయక విరిగిపోయిన మరునాడే షూటింగుల్లో పాల్గొంటాడు.
అతడి తాజా చిత్రం `లత్తి` షూటింగ్ సమయంలో ఒకటికి రెండుసార్లు గాయపడ్డాడు. గాయపడిన ఒక రోజు తర్వాత విశాల్ సెట్ కి తిరిగి వచ్చి అందరికీ షాకిచ్చాడు. ఆదివారం సాయంత్రం `లత్తి` సెట్స్ లో విశాల్ స్టంట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు అతడి కాలికి గాయమైందని.. అతడు కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని టీమ్ ప్రకటించింది. అయితే ఇంతలోనే విశాల్ మరుసటి రోజు మళ్లీ సెట్‌లోకి జాయిన్ అయ్యాడని షూటింగ్ కొనసాగించాడని తెలిసింది.
``విశాల్ ఒక యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటున్నాడు. ఇందులో చాలా మంది గూండాలు దాడి చేస్తున్నప్పుడు అతని పాత్ర దోషిని సురక్షితంగా తీసుకువెళుతుంది. అతను తనను తాను రక్షించుకోవడానికి లాఠీని ఉపయోగిస్తుంటాడు. అయితే స్టంట్ మెన్ ల వద్ద కత్తులు వంటి ఆయుధాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఒక ఫైటర్ తన ఆయుధాన్ని విశాల్ పైకి విసిరాడు. అది విశాల్ కాలిని తాకింది. అటుపై అతను లేచి నిలబడలేకపోయాడు - అతని కాలు కూడా కదలలేదు.. వెంటనే స్టంట్ యూనియన్ సభ్యులు అతనికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం విశ్రాంతి కోసం నైట్ లో ఇంటికి వెళ్ళాడు. కానీ విశాల్ మరుసటి రోజు సెట్ లోకి దిగి షూటింగ్ కొనసాగించడం ద్వారా తన బృందాన్ని ఆశ్చర్యపరిచాడు.
ఆసక్తికరంగా ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం మరో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు విశాల్ వేలికి గాయం కావడంతో షూటింగ్ కొంతకాలం ఆగిపోయింది. దానికి కేరళలో ట్రీట్ మెంట్ తీసుకోవడానికి కొద్దిరోజులు విరామం తీసుకోవలసి వచ్చింది. గతేడాది `వీరమే వాగై సూదుం` సినిమా చేస్తున్నప్పుడు వెన్నులో గాయం అయింది. వరుస గాయాలు బాధించినా అతడు మారడు. ``నేను గాయాల నుండి రోగనిరోధక శక్తిని పొందానని అనుకుంటున్నాను`` అని విశాల్ నవ్వుతూ చెప్పాడు.
కాలి గాయానికి కారణం కూడా విశాల్ చెప్పాడు. సాయంత్రం వేళ ఆలస్యంగా షూటింగ్ చేశాం. మేము చెన్నైలోని అటవీ ప్రదేశంలో ఒక యాక్షన్ సీన్ ని చిత్రీకరిస్తున్నాము. ఇది ఫ్రీస్టైల్ యాక్ట్.. ఇక్కడ నేను దోషిని రక్షించడానికి నా లాఠీని ఉపయోగించాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో.. నా కాలు మొద్దుబారినట్లు అనిపించింది. మొదట ఇది జలగ అనుకుని అకారణంగా నా ప్యాంటును పైకి చుట్టి చూసాను. అప్పుడే నాకు టెన్నిస్ బాల్ పరిమాణంలో వాపు కనిపించింది! ఎంగెయ్యో అదిపట్టుడుచు.. ఎప్పడినే తేరిలా... అన్నాను.
కానీ నేను ఆ ఒక్క షాట్ ని పూర్తి చేయాలనుకున్నాను.. ఎందుకంటే మొత్తం సెటప్ మళ్లీ తిరిగి వేయడం వృథా అవుతుంది. తరువాత.. ఇంట్లో.. నన్ను డాక్టర్ దగ్గర చేర్చారు. వాపు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతోంది .. అని విశాల్ తెలిపాడు.
Full View