న్యాయ పోరాటంకు సిద్దమైన హీరో

Update: 2019-04-30 07:48 GMT
తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ అధికార దుర్వినియోగం చేశాడని, నిధులను వృదా చేస్తున్నట్లుగా కొందరు నిర్మాతలు ప్రభుత్వంకు ఫిర్యాదు చేయడం జరిగింది. పెద్ద నిర్మాతలకు మద్దతుగానే విశాల్‌ ఉంటున్నాడు, చిన్న నిర్మాతలను అసలు విశాల్‌ పట్టించుకోవడం లేదంటూ వారు ఫిర్యాదు చేశారనే విషయం తెల్సిందే. నిర్మాతల ఫిర్యాదుతో తమిళనాడు ప్రభుత్వం నిర్మాతల మండలి కంట్రోల్‌ కు ఎన్‌ శేఖర్‌ అనే అధికారిని నియమించిన విషయం తెల్సిందే. ఈ విషయమై నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ సీరియస్‌ అయ్యాడు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంను సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. అంతా కూడా రూల్స్‌ కు లోబడే జరుగుతుందని, నిధుల ఖర్చు మరియు ఇతర విషయాలకు సంబంధించిన నిర్ణయాలు అన్ని కూడా సమావేశంలో చర్చించే తీసుకుంటున్నట్లుగా విశాల్‌ చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం నిర్మాతల మండలిపై అజమాయిషీ చేసేందుకు చూడటం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ విశాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ విషయమై కోర్టును ఆశ్రయించిన విశాల్‌ వెంటనే విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు కోర్టు సమ్మతించి వెంటనే విచారించేందుకు ఓకే చెప్పింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారిని తొలగించాలంటూ విశాల్‌ కోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికే ప్రభుత్వం వివరణ కోరిన కోర్టు ఇరు వర్గాల వాదనలు విని త్వరలోనే తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. నిర్మాతల మండలిపై అజమాయిషీకి ప్రభుత్వం అధికారిని ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకం అని, వెంటనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ విశాల్‌ కోరుతున్నాడు. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.
Tags:    

Similar News