నాగార్జున హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కి చాలా ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'సూపర్'. ఆ సినిమా తో హీరోయిన్ గా అయేషా టకియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్నా కూడా టాలీవుడ్ లో అయేషా స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకోవడంలో మాత్రం విఫలం అయ్యింది.
అయేషా తెలుగు లో రాణించలేక పోయినా కూడా ఇతర భాషల్లో కొన్నాళ్ల పాటు హడావుడి చేసింది. చివరకు ఆమె హీరోయిన్ గా నే కాకుండా ఇంకా పలు విధాలుగా కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నించింది. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికి కూడా అభిమానులతో టచ్ లో ఉంటూ ఇండస్ట్రీలో కొనసాగడంపై ఆసక్తి చూపిస్తూనే ఉంది.
హీరోయిన్ గా చాలా సినిమాలు చేసిన అయేషా టకియా పెళ్లి అయ్యి తల్లి కూడా అయ్యింది. ఇటీవల ఫ్యామిలీతో కలిసి అయేషా ముంబై నుండి గోవా కి విహార యాత్రకు వెళ్లింది. విహార యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణం అయిన అయేషా ఫ్యామిలీకి ముంబయి ఏయిర్ పోర్ట్ లో అవమానం జరిగింది. ఆ విషయాన్ని స్వయంగా అయేషా భర్త ఫర్హాన్ అజ్మీ సోషల్ మీడియా ద్వారా వెళ్లడించాడు.
తమ మతం మరియు తమ యొక్క వర్ణం పై కామెంట్స్ చేస్తూ ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్నారు అంటూ అజ్మీ అన్నాడు. తన భార్య పై తన ముందే విమానాశ్రయ అధికారులు అసభ్యంగా వ్యవహరించారు అంటూ అజ్మీ అసహనం వ్యక్తం చేశాడు. తన భార్య పై చేయి వేయడం తో పాటు ఆమె ను ఫిజికల్ గా టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
తమపై సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరు మరియు వారు మాట్లాడిన మాటలు అన్ని కూడా తమను చాలా ఇబ్బందికి గురి చేసేవిగా ఉన్నాయన్నాడు. తమ పట్ల ఇబ్బందికరంగా వ్యవహరించిన ఇద్దరు ఎయిర్ పోర్ట్ అధికారుల పై ఫిర్యాదు చేస్తానంటూ ప్రకటించాడు. అయేషా పేరును గట్టిగా పలుకుతూ పక్కన ఉన్న అధికారులతో నవ్వుకున్నట్లుగా కూడా అయేషా మరియు అజ్మీ ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై సీఐఎస్‌ఎఫ్ అధికారులు స్పందించాలని జాతీయ మీడియా కూడా డిమాండ్ చేస్తుంది. ఎయిర్ పోర్ట్ లో ఇలా వర్ణ వివక్ష మరియు మత వివక్ష చూపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాంటూ చాలా కాలంగా ఒక వర్గ వారు డిమాండ్ చేస్తున్నా కూడా చర్యలు తీసుకోవడం లేదు అంటూ మీడియాకు చెందిన కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తమ పట్ల అసభ్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారుల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అజ్మీ షేర్ చేయడంతో ఖచ్చితంగా ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. అసలు జరిగింది ఏంటీ అనేది ఉన్నతాధికారుల ఎంక్వౌరీతో వెళ్లడయ్యే అవకాశం ఉంది.