య‌ష్ ముందు టైగ‌ర్ ష్రాఫ్ దిగ‌దుడుపేనా?

Update: 2022-05-01 10:30 GMT
టైగ‌ర్ ష్రాఫ్ .. ఈ పేరుకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అస‌మాన ప్ర‌తిభావంతుడు. డ్యాన్సులు ఫైట్స్ మార్ష‌ల్ ఆర్ట్స్ లో అద‌ర‌గొడ‌తాడు. దిశా ప‌టానీ స‌హా ఎంద‌రో యువ‌తుల మ‌న‌సు దోచిన యంగ్ ట్యాలెంటెడ్ హీరో. టైగ‌ర్ ష్రాఫ్ స్టంట్స్ కి వ‌రల్డ్ వైడ్ మాస్ లో ఫాలోయింగ్ ఉంది. కానీ అత‌డు సౌత్ రాక్ స్టార్ య‌ష్ ముందు త‌లొంచాడా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. వార్ లాంటి బాక్సాఫీస్ బంప‌ర్ హిట్ తో ఊపు మీద ఉండీ.. ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీలో సీక్వెల్ తో బ‌రిలో దిగి కూడా అత‌డు ఆశించిన‌ది సాధించ‌లేక‌పోయాడు.

టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన హీరోపంతి 2 ఈ శుక్ర‌వారం విడుద‌లై సోసోగానే నిలిచింది. వీకెండ్ వ‌సూళ్లు అంతంత మాత్ర‌మే. బాక్స్ ఆఫీస్ ప్ర‌కారం.. రెండో రోజు (శనివారం) డ్రాప్స్ క‌నిపించాయి. ఇది కేవ‌లం 5.25 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఓపెనింగ్ రోజున 6.50 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం సండే ఎలాంటి వ‌సూళ్ల‌ను సాధిస్తుంది అన్న‌ది వేచి చూడాలి.

టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన హీరోపంతి 2 రెండో రోజు దాదాపు 15 నుంచి 25 శాతం వ‌సూళ్ల ప‌రంగా తగ్గింది. తొలి అంచనాల ప్రకారం ఈ సినిమా రూ. రూ. 5.50 కోట్లు క‌లుపుకుని రెండు రోజుల మొత్తం రూ. 11.25 కోట్లుగా నిలిచింది. జాతీయ మ‌ల్టీప్లెక్స్ చైన్ లు అయినా లేదా సింగిల్ స్క్రీన్ లైనా సరే - ఈ తగ్గుదల చాలా వరకు క‌నిపించింది.

మొదటి రోజు మాదిరిగానే మూడు జాతీయ మ‌ల్టీప్లెక్స్ చైన్ లు - PVR- INOX -Cinepolis ద్వారా ఆధిపత్యం చెలాయించినా కానీ ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. హీరోపంథి2 రెండు రోజుల మొత్తంలో మూడు మల్టీప్లెక్స్ లు దాదాపు 65 శాతం అందించాయి. సాధారణంగా ఇలాంటి మాస్ ఓరియెంటెడ్ చిత్రానికి సింగిల్ థియేట‌ర్ల‌లో ఆద‌ర‌ణ ద‌క్కాల్సి ఉన్నా అది ద‌క్క‌లేదు.

ఒక మోస్తరు ఓపెనింగుతో మొద‌లైన‌ తర్వాత రెండవ రోజు వ‌సూళ్లు తగ్గడం అనేది ఖచ్చితంగా ప్రోత్సాహకరమైన సంకేతం కాదు. సినిమా ఆదివారం కూడా ఫ్లాట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మూడు రోజుల వీకెండ్ బిజ్ దాదాపు రూ. 16.75 నుండి 17.25 కోట్లు మాత్ర‌మే. మంగళవారం ఈద్ సెలవుదినం బుధవారం బసి ఈద్ కారణంగా పాక్షిక సెలవుదినం ఉంటుంది గ‌నుక‌ హీరోపంతి ఈ సెలవులను సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి.

అయితే ఇప్పుడు హీరో పంథికి వ‌చ్చిన డివైడ్ టాక్ నేప‌థ్యంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా కేజీఎఫ్ 2 ను తిరిగి సింగిల్ స్క్రీన్ల‌లో ఆడించేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌న్న టాక్ వినిపిస్తోంది. దీనివ‌ల్ల మూడవ వారంలోనూ ర‌న్నింగ్ లో ఉన్న KGF 2 నుండి సోమవారం నుండి మాస్ బెల్ట్ ల్లో హీరో పంథి గట్టి పోటీని ఎదుర్కొంటుంది.

ఎందుకంటే కేజీఎఫ్ 2 ఇప్ప‌టికీ అసాధారణమైన వ‌సూళ్ల‌తో అద‌ర‌గొడుతోంది. మూడవ వారంలో కూడా కొత్త విడుదలలు ఉన్నా జ‌నం ఖాతరు చేయ‌కుండా కేజీఎఫ్ 2 కిక్కును ఆస్వాధించేందుకు థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు.  ఈద్ లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ తో ఇది మరొక స్థాయిలో పేలుతుందన్న టాక్ వ‌చ్చింది.

ఈద్ హాలిడేలో కేజీఎఫ్ బ్లాస్టింగేనంటూ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ సూచిస్తోంద‌ని బాలీవుడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక కేజీఎఫ్ ఆరంభ వ‌సూళ్ల ముందు హీరో పంథి ఐపు లేకుండా పోయింది. కేజీఎఫ్ మొదటి రోజు వ‌సూళ్ల‌లో బాలీవుడ్ రికార్డుల‌న్నిటినీ తిరగ‌రాసి నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. ఇక ఇది రెండు రోజుల్లోనే 200 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం.

ఈ చిత్రం ఇప్ప‌టికే 1000 కోట్ల క్ల‌బ్ లో చేరి త‌న ద‌రిని ఎవ‌రూ చేర‌లేర‌న్న సంకేతం అందించింది. ఇక టైగ‌ర్ ష్రాఫ్ స్టంట్స్ కి ఎంత గొప్ప టాక్ వ‌చ్చినా ఎంత‌గా ఫాలోయింగ్ ఉన్నా కానీ రాకింగ్ స్టార్ య‌ష్ ప్ర‌ద‌ర్శ‌న ముందు ఏదీ నిల‌వలేద‌ని ప్రూవైంది. ఇక ఇప్ప‌టికే అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ స్టార్ హీరోల వ‌రుస‌లో టైగ‌ర్ ష్రాఫ్ కూడా చేర‌తాడా?  జాన్ అబ్ర‌హాం-అక్ష‌య్- అజ‌య్ దేవ‌గ‌న్ త‌ర‌హాలోనే ఇంకా బింకం ప్ర‌ద‌ర్శిస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడు కంగ‌న లాంటి అక్క అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్న య‌ష్ ని టైగ‌ర్ సైతం ఢీకొట్ట‌డం అంత క్షేమ‌క‌రం కాదేమో!!
Tags:    

Similar News