అల్లు అరవింద్ సమర్పణలో షాహిద్ కపూర్ కథానాయుడిగా బాలీవుడ్ లో `జెర్సీ` చిత్రం రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీలోనే తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్స్ట్..దిల్ రాజు ప్రొడక్షన్స్..సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనిట్ ప్రచారం పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ ని నవంబర్23న రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ అధికారికంగా తెలిపింది. అలాగే డిసెంబర్ 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు రివీల్ చేసారు.
వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సింది. కొవిడ్ కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడింది. కరోనా తగ్గుముఖం పట్టడం తో రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది. ఇక ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతుందా? థియేటర్లో రిలీజ్ అవుతుందా? అన్న సందేహాలకు తెరపడింది.
నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ర్టాల్లో థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో రన్నింగ్ లో ఉన్నాయి. కొన్ని చోట్ల పరిమితులు ఉన్నా...వాటిని గాలికి వదిలేసినట్లు విమర్శ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో `జెర్సీ` పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే.
విమర్శకుల ప్రశంలందుకున్న గొప్ప చిత్రంగా నిలిచింది. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఓ రంజీ ప్లేయర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. మాతృకలో శ్రద్దా శ్రీనాధ్ పోషించిన పాత్రని బాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ పోషిస్తోంది. పంకజ్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.