రవితేజ ఖిలాడి హిందీ వర్షన్‌ కు పుష్ప ఫార్ముల

Update: 2022-02-10 01:30 GMT
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న ఖిలాడి సినిమా తెలుగు లోనే కాకుండా హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌ లో మంచి పేరున్న పెన్‌ స్టూడియో ఖిలాడి డబ్బింగ్‌ రైట్స్ ను దక్కించుకోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి ని ఆకర్షిస్తుంది. ఉత్తర భారతంలో భారీ ఎత్తున ఖిలాడి హిందీ వర్షన్ ను విడుదల చేసేందుకు గాను ఇప్పటికే పెన్ స్టూడియో థియేటర్లను బుక్ చేసినట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఖిలాడి సినిమా కోసం ప్రథానంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లను మాత్రమే ఎంపిక చేశారని తెలుస్తోంది.

పుష్ప సినిమా హిందీ వర్షన్‌ వంద కోట్లు వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఆ సినిమాకు ఫాలో అయిన విధానంను ఖిలాడికి ఫాలో అవ్వబోతున్నారట. పుష్ప సినిమా మెజార్టీ వసూళ్లు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల నుండి వచ్చాయట. అది కూడా మెట్రో నగరాల్లో కాకుండా చిన్న పట్టణాల్లో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయట. కనుక ఖిలాడి సినిమాను కూడా ముంబయి వంటి మహా నగరంలో మల్టీ ప్లెక్స్ ల్లో విడుదల చేయకుండా సింగ్ స్క్రీన్‌ థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే సింగిల్ స్క్రీన్‌ థియేటర్లను పెద్ద మొత్తంలో పెన్ స్టూడియో బుక్‌ చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో పెద్ద సినిమాలే కాదు కనీసం చిన్న సినిమాలు కూడా విడుదల కావడం లేదు. కనుక ఖిలాడికి కలిసి వస్తుందని అంటున్నారు.

మొన్న మొన్నటి వరకు ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో కరోనా కారణంగా ఆంక్షలు కొనసాగాయి. కాని ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఆ ఆంక్షలను కూడా తొలగించి ఫ్రీ గా వదిలేశాయి. కనుక ఖచ్చితంగా హిందీ ఖిలాడి వసూళ్ల విషయంలో కుమ్మేయడం ఖాయం అంటున్నారు. రవితేజ ఖిలాడి హిందీ వర్షన్‌ ఖచ్చితంగా పాతిక నుండి ముప్పై కోట్ల వరకు వసూళ్లను ఉత్తర భారతంలో రాబట్టే అవకాశాలు ఉన్నాయని బయ్యర్లు ధీమాగా ఉన్నారట.

ఆ మొత్తం రాబడితే ఖచ్చితంగా ఖిలాడికి అది పెద్ద అచీవ్ మెంట్‌ అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు రవితేజకు అక్కడ పెద్దగా బజ్ లేదు. కాని పుష్ప సినిమా ఇతర తెలుగు సినిమాలు హిందీ ప్రేక్షకులను అలరించాయి. కనుక తెలుగు సినిమా డబ్బింగ్ అనగానే హిందీ ప్రేక్షకులు ఒకింత ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాకు కాస్త పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తే సినిమాల కోసం మెహం వాచి ఉన్న ఉత్తరాది వారు ఖిలాడిని తెగ చూసేయడం ఖాయం అనిపిస్తుంది. మరి ఖిలాడి అదృష్టం ఎలా ఉందో చూడాలంటే మరో రెండు రోజులు వెయిట్‌ చేయాల్సిందే.
Tags:    

Similar News