లవ్ బ్రేకప్ అయినప్పుడు లేదంటే పెళ్లి పెటాకులు అయినప్పుడు ఆమె లేదా అతడు డిప్రెషన్ కి గురి అవ్వడం మనం చూస్తూ ఉంటాం. కొద్ది మంది వెంటనే బయటకు వస్తే.. కొద్ది మంది మాత్రం డిప్రెషన్ తో ఏకంగా ఆత్మహత్య వరకు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు.
హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ను దాదాపు అయిదు సంవత్సరాల క్రితం ఆయన భార్య ఏంజిలినా జోలి విడిచి వెళ్లింది. విడాకులు తీసుకున్న వీరిద్దరూ ప్రస్తుతం ఎవరికి వారు అన్నట్లుగా ఉంటున్నారు. పిల్లలు ఏంజిలినా జోలి వద్ద ఉన్నారు. ఒంటరితనంతో బ్రాడ్ పిట్ చాలా ఇబ్బంది పడ్డాడట. ఒకానొక సమయంలో తీవ్ర మనస్థాపానికి గురి అయినట్లుగా పేర్కొన్నాడు.
ఆ ఒంటరితనం నుండి బయట పడటానికి.. విడాకుల బాధ నుండి బయటకు రావడానికి బ్రాడ్ పిట్ ఏదో ఒక వ్యసనంకు అలవాటు అవ్వాలి అనుకున్నాడు. అయితే మందు.. సిగరెట్ వంటి వాటికి అలవాటు పడకుండా శిల్పాలను చెక్కుతూ అదే ఒక వ్యసనం అన్నట్లుగా మార్చుకున్నాడు.
శిల్ప కళలకు దగ్గర అయిన బ్రాడ్ పిట్ చెక్కిన శిల్పాలను ఫిన్లాండ్ లో ఒక ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. బ్రాడ్ పిట్ యొక్క శిల్పాలకు మంచి గుర్తింపు వచ్చింది. అంతే కాకుండా ఇలాంటి ఒక అద్భుతమైన ప్రతిభ ఆయనలో దాగి ఉందా అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా బ్రాడ్ పిట్ మాట్లాడుతూ.. ఈ శిల్పా ల్లో తనను తాను వెతుక్కుంటూ జీవితాన్ని గడుపుతున్నాను. గతంలో చేసిన తప్పులను ఈ శిల్పాలు చెక్కుకుంటూ సమీక్షించుకోవడంతో పాటు మళ్లీ తప్పులు చేయకుండా ఉంటున్నాను.. అలాగే తాను చేసిన తప్పులు ఇతరులు చేయకూడదు అనే ఉద్దేశ్యంతో వారికి ఈ శిల్పాల ద్వారా మెసేజ్ ఇస్తున్నాను అన్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.