లుంగీ అనేది సౌత్ ఇండియన్స్ కు మాత్రమే తెలిసిన కాస్ట్యూమ్. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పలు హిందీ సినిమాల్లో లుంగీ కాస్ట్యూమ్స్ ను వాడటం తో పాటు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమా లో లుంగీ డాన్స్ ను పెట్టి మరింత పాపులారిటీని లుంగీ కి కల్పించిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే లుంగీ కాస్ట్యూమ్ ను హాలీవుడ్ వరకు కూడా వెళ్లిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
హాలీవుడ్ స్టార్ నటుడు బ్రాడ్ ఫిట్ ఇటీవల తాను నటించిన బుల్లెట్ ట్రైన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు.
ఇటీవల సినిమా ప్రివ్యూ వేసిన సందర్బంగా ఈ తరహా కాస్ట్యూమ్ లో కనిపించాడు. అమ్మాయిలు వేసుకునే స్కర్ట్ మాదిరిగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మన ఇండియన్ నెటిజన్స్ మాత్రం లుంగీ ఎగ్గట్టినట్లుగా ఉందంటున్నారు.
ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఫ్యాషన్ అయిన లుంగీ ఎగ్గట్టడం ఇప్పుడు హాలీవుడ్ వరకు బ్రాడ్ పిట్ తీసుకు వెళ్లాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ఈ కాస్ట్యూమ్స్ ను ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తూ కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు.
మొత్తానికి తాను అనుకున్నది బ్రాడ్ ఫిట్ సాధించాడు. సినిమా కు మంచి పబ్లిసిటీ దక్కాలనే ఉద్దేశ్యంతో ఆ కాస్ట్యూమ్ ధరించాడు. ఆయన అనుకున్నట్లుగానే బుల్లెట్ ట్రైన్ ప్రెస్ మీట్ లో.. ప్రీవ్యూ మీట్ లో ఈ డ్రస్ అన్నట్లుగా మీడియా లో అంతర్జాతీయ స్థాయిలో పబ్లిసిటీ దక్కింది.
హీరో గారి విచిత్రమైన లుంగీ కాస్ట్యూమ్ పబ్లిసిటీని మెచ్చుకోవాల్సిందే. ఇంతకు ఆ కాస్ట్యూమ్ పేరు ఏంటీ అనేది బ్రాండ్ ఫిట్ తర్వాత ప్రెస్ మీట్ లో అయినా చెప్తాడేమో చూడాలి.