హోరాహోరీ: ఇంకా అదే మూస‌లో...

Update: 2015-09-12 07:30 GMT
కొత్త కుర్రాళ్ల‌తో స‌హ‌జ‌ సిద్ధంగా ప్రేమ‌క‌థ‌ల్ని తెర‌కెక్కించి బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ కొట్ట‌డం తేజ‌కి తెలిసిన మంత్రం. చిత్రం, నువ్వు నేను, జ‌యం ఇవ‌న్నీఆ కోవ‌కే చెందుతాయి. ఆ సినిమాల‌న్నీ కొత్త కుర్రాళ్ల‌తో తీసిన‌వే. మ‌రోసారి హోరా హోరీ తో అలాంటి ప్ర‌య‌త్న‌మే చేశాడు. ప‌రిమిత బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కించిన  ఈ సినిమాతో దిలీప్‌ - ద‌క్ష అనే ఇద్ద‌రు కొత్త తార‌ల్ని తెర‌కి ప‌రిచ‌యం చేశాడు. ఈ ల‌వ్‌ స్టోరీని ఎప్ప‌టిలాగే  త‌న పంథాలోనే తీశాడు. అయితే ఈసారి నిజం -  చిత్రం - జ‌యం సినిమాల‌తో చేసిన మ్యాజిక్‌ ని రిపీట్ చేయ‌డంలో త‌డ‌బ‌డ్డాడు.

హోరా హోరీ క‌థ‌ - క‌థ‌నం - డైలాగులు అన్నీ తేజ‌నే. ఆ మూడు విభాగాలు ఈ సినిమాకి పెద్ద మైన‌స్‌. క్యారెక్ట‌ర్ ల ఎమోష‌న్స్ ఏమాత్రం క్లిక్క‌వ్వ‌లేదు. స్లో నేరేష‌న్ పెద్ద మైన‌స్‌. పైగా కామెడీ స‌న్నివేశాల్లో కానీ, ఎమోష‌న్ పండించే సీన్ల‌లో కానీ డైలాగులు కానీ ఎక్క‌డా పండ‌లేదు. విల‌నీ వెరీ రెగ్యుల‌ర్‌.  హీరో - విల‌న్‌ - అడ‌వి బ్యాక్ డ్రాప్ ఇవ‌న్నీ చూడ‌గానే మ‌రోసారి జ‌యం తీస్తున్నాడా అన్న క‌న్ఫ్యూజ‌న్ ఆడియెన్‌ కి క‌లుగుతుంది. ఏ ఫ్రేములోనూ గ్రిప్ అనేదే క‌నిపించ‌దు. దానికి తోడు స‌హాయ‌క పాత్ర‌లు పెద్ద న‌స‌. తేజ ఎప్ప‌టిలానే  నేచురాలిటీ పేరుతో అస‌లు హీరోయిజం అన్న‌దే చూపించ‌లేదు. ఇక మొద‌టి నుంచి రెయిన్ బ్యాక్‌ డ్రాప్, హీరోయిన్‌ కి అనారోగ్యం అంటూ తేజ చేసిన ప్ర‌చారం చూసి.. గుండె ప‌ట్టేసే ప్రేమ‌క‌థ చూపించేస్తున్నాడేమో అనుకున్న‌వారికి అంతా నిరాశే ఎదురైంది.

తేజ లాంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్  తీయాల్సిన సినిమా కాదిది. ఇంకా తేజ పాత క‌థ‌ల్ని, పాత పంథాని ప‌ట్టుకుని వేలాడ‌డం వ‌ల్లే అదే మూస క‌నిపించింది ప్ర‌తి ఫ్రేములో. మారుతున్న స‌మాజంతో పాటు అత‌డు మారిన‌ట్టు కానీ, అప్‌ డేట్ అయిన‌ట్టు కానీ అనిపించ‌లేదు. ఈ సినిమాలో నేచుర‌ల్ లైటింగ్‌ - నేచుర‌ల్ యాక్టింగ్ అంటూ ప‌ర‌మ బోరింగ్ సినిమానే తీసి చూపించాడ‌న్న విమ‌ర్శ‌లు క్రిటిక్స్ నుంచి వ‌చ్చాయి. చిత్రం, నువ్వు నేను, జ‌యం ల‌వ్‌ స్టోరీస్‌ లో ట్రెండ్ సెట్ట‌ర్స్‌. వాటిలో ఏ స‌న్నివేశాన్ని తీసి  పారేయ‌లేం. కానీ హోరా హోరీలో ఏ స‌న్నివేశాన్ని గుర్తు పెట్టుకోలేం. అంత తేడా ఉంది. అలా కాకుండా తేజ స్ర్కిప్టు విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ పెట్టి ఉంటే బావుండేదే. అస‌లు ఈ సినిమాకి ఏది ప్ల‌స్‌? అంటే ఆ లొకేష‌న్ లు ఒక్క‌టే. అసలు వాటీజ్‌ దిస్‌ తేజ?
Tags:    

Similar News