సంక్రాంతి గొడవ.. ఎవరికి ఎన్ని థియేటర్స్ అంటే..

Update: 2022-12-28 14:01 GMT
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సంక్రాంతి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోతున్నట్లు అర్థమవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒకేసారి రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు కూడా ఈ సంక్రాంతికి తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోబోతున్నారు.

ఏమాత్రం పాసిటివ్ టాక్ వచ్చిన కూడా ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి సంక్రాంతి ఫెస్టివల్ లో కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ రేంజ్ అయితే అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నుంచి రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అలాగే వీరసింహారెడ్డి కూడా తక్కువ ఏమి కాదు కాబట్టి ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంది.

ఇక ఎవరికి ఎన్ని థియేటర్లు దొరకబోతున్నాయనే విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ కి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే వీరసింహారెడ్డి అలాగే విజయ్ వారసుడు సినిమాకు సమానమైన ధియేటర్లు వచ్చే అవకాశం ఉంది. దాదాపు రెండు సినిమాలకు 200 థియేటర్ల చొప్పున ఇచ్చే ఛాన్స్ ఉందట. ఇక వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం డిమాండ్ ను బట్టి థియేటర్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది.

ఇక మరో తమిళ హీరో అజిత్ తెగింపు సినిమాకు అయితే నైజం లో ఇంకా థియేటర్ల సంఖ్య ఫిక్స్ కాలేదు. ఈ సినిమాకు తప్పకుండా మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అయితే కొన్ని వస్తాయి. కానీ సింగిల్ స్క్రీన్స్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

ఇక ఈ సినిమాకు ఎంతో పాజిటివ్ టాక్ వస్తే గాని విడుదల తర్వాత థియేటర్ల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ సంక్రాంతి గొడవలో ఎవరు మంచి టాక్ అందుకుంటారు.. అలాగే విడుదలైన తర్వాత ఎవరు ఎక్కువ స్థాయిలో థియేటర్ల సంఖ్యను పెంచుకుంటారు.. అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News