పవన్ ఫ్యామిలీ లక్ష్యంగా అసభ్యకరంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం?

Update: 2021-09-28 16:25 GMT
సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి సోమవారం ప్రెస్ మీట్ పెట్టి పవన్‌ కల్యాణ్‌ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పోసాని సోమాజిగూడలోని ప్రెస్‌ క్లబ్‌ లో మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు. పవన్‌ ఫ్యాన్స్‌ తన ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని పోసాని ఆరోపించారు. నిన్న రాత్రి నుంచి అమ్మానా బూతులు తిడుతూ కొన్ని వేల ఫోన్‌ కాల్స్ మెస్సేజ్‌ లు పెడుతున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్ తన భార్యను ఉద్దేశిస్తూ 'మీ పని వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.. నిజం కాదా?' అని మెసేజ్ పెట్టాడని పోసాని కృష్ణ మురళి తెలిపారు. ''పవన్ కళ్యాణ్ నీ సైకో ఫ్యాన్స్ తో నా భార్య పట్ల ప్రశ్నలు వేయించావు కదా.. అందుకే నేను కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నా.. 'పవన్ కల్యాణ్.. నువ్వు షూటింగ్ లకు వెళ్ళగానే మీ పెళ్ళాం అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు.. అది నిజమా కాదా?. ఆ బిడ్డలు నీకు పుట్టలేదు అంట.. పని వాళ్ళకే పుట్టారు అంట.. నిజమా కాదా?'' అంటూ పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో 'సిగ్గు లేని నా కొ*కా' వంటి అభ్యంతరకరమైన అసభ్య పదజాలాన్ని పోసాని ఉపయోగించారు.

పోసాని కృష్ణ మురళి తన భార్యపై పవన్ ఫ్యాన్స్ అసభ్యంగా మాట్లాడారని ఇలా మాట్లాడినా.. పవన్ కళ్యాణ్ మరియు అతని కుటుంభాన్ని ఈ విధంగా దూషించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొత్తం ఎపిసోడ్‌ లో పవన్‌ కు వ్యతిరేకంగా పోసాని ఉపయోగించిన భాష ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌ లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ తల్లి, అతని భార్య మరియు పిల్లలను కూడా ఇందులోకి లాగడం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ అభిమానులు చేసిన తప్పుకు.. ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టడం ఎంతవరకు సమంజసమని అందరూ ప్రశ్నిస్తున్నారు.

ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయమని పవన్ కల్యాణ్ కు చెప్పడమో.. లేదా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడమో చేయాలి కానీ.. ఇలా ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంటే పోసాని వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. వాళ్ళు అసభ్యంగా మాట్లాడారని ప్రెస్ మీట్ పెట్టి మరీ మీరూ అదే పని చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలను తెలంగాణ జనసేన పార్టీ తీవ్రంగా పరిగణించింది. పోసాని మీద పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆయన్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని కోరింది.

ఇకపోతే ప్రెస్ క్లబ్ నుంచి పోసాని బయటకు వస్తున్న సమయంలో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన మీద దాడికి యత్నించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. పవన్‌ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తను చనిపోతే అందుకు పవన్‌ కల్యాణే కారణమని.. అతనిపై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
Tags:    

Similar News